ఇథియోపియాలో తెలుగువారు సురక్షితం | Telugu people safe in Ethiopia | Sakshi
Sakshi News home page

ఇథియోపియాలో తెలుగువారు సురక్షితం

Oct 11 2016 2:25 AM | Updated on Sep 4 2017 4:54 PM

ఇథియోపియాలోని బాలెరోబోలో చిక్కుకున్న దాదాపుగా 30 మంది తెలుగువారు క్షేమంగా ఉన్నారని, మాడవలబు వర్సిటీ లోపలి వారు

సాక్షి, న్యూఢిల్లీ: ఇథియోపియాలోని బాలెరోబోలో చిక్కుకున్న దాదాపుగా 30 మంది తెలుగువారు క్షేమంగా ఉన్నారని, మాడవలబు వర్సిటీ లోపలి వారు సురక్షితంగా ఉన్నారని ఢిల్లీలోని ఏపీ భవన్ అధికారులు తెలిపారు. ఓరోమో వర్గీయులు తమ నిరసనలో భాగంగా బాలెరోబోకి వెళ్లే రహదారులను మూసివేయడంతో తెలుగు వారు బాలెరోబోలోని వర్సిటీలో చిక్కుకున్నారు.

తమకు మరిన్ని హక్కులు కావాలని, ప్రజాస్వామ్యం నెలకొనాలని ఒరిమోలు నిరసనలు చేపట్టారు. ఇథియోపియాలోని భారత రాయబార కార్యాలయం అధికారులు మాడవలబు వర్సిటీ అధ్యాపకులతో మాట్లాడారని, తెలుగువారు సురక్షితమని ఢిల్లీలోని ఏపీ భవన్ అధికారులు తెలిపారు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement