మీకు హిమాన్షు.. మాకు దేవాన్ష్‌ | telangana assembly sessions | Sakshi
Sakshi News home page

మీకు హిమాన్షు.. మాకు దేవాన్ష్‌

Mar 27 2017 12:32 PM | Updated on Aug 11 2018 6:42 PM

మీకు హిమాన్షు.. మాకు దేవాన్ష్‌ - Sakshi

మీకు హిమాన్షు.. మాకు దేవాన్ష్‌

తెలంగాణ అసెంబ్లీ ఆవరణలో అధికార, ప్రతిపక్ష పార్టీ నాయకుల మధ్య ఆసక్తికర చర్చ జరిగింది.

హైదరాబాద్‌: తెలంగాణ అసెంబ్లీ ఆవరణలో అధికార, ప్రతిపక్ష పార్టీ నాయకుల మధ్య ఆసక్తికర చర్చ జరిగింది. సస్పెండ్‌ అయిన టీడీపీ ఎమ్మెల్యే రేవంత్‌ రెడ్డి సోమవారం ఉదయం అసెంబ్లీకి వెళ్లారు. ఆ సమయంలో  అక్కడే ఉన్న టీఆర్‌ఎస్‌ ఎంపీ బాల్క సుమన్‌ ఆయనతో ‘ సస్పెండైన మిమ్మల్ని ఎలా రానిచ్చారన్నా’ అని అడిగారు. దీనికి రేవంత్‌ బదులిస్తూ.. ‘ హిమాన్షు.. వాళ్ల తాత కేసీఆర్‌కు చెప్పాడు కాబట్టే నన్ను ఇక్కడిదాకా అనుమతిచ్చారు. మీలాంటి స్నేహితులు ఉండి ఏం లాభం? మీ కన్నా హిమాన్షు బెటర్‌’  అని  రేవంత్‌ రెడ్డి అన్నారు. దీంతో అక్కడ ఒక్కసారిగా నవ్వులు పూశాయి. మీకు హిమాన్షు.. మాకు దేవాంశ్‌ ఉన్నాడని సుమన్‌తో అనడంతో పక్కనే ఉన్న నేతలు కూడా నవ్వుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement