హామీలు నెరవేరుస్తున్న టీబీజీకేఎస్‌ | TBGKS meeting | Sakshi
Sakshi News home page

హామీలు నెరవేరుస్తున్న టీబీజీకేఎస్‌

Oct 17 2016 11:26 AM | Updated on Sep 2 2018 4:16 PM

హామీలు నెరవేరుస్తున్న టీబీజీకేఎస్‌ - Sakshi

హామీలు నెరవేరుస్తున్న టీబీజీకేఎస్‌

కార్మికులకు ఇచ్చిన హామీలను టీబీజీకేఎస్‌ యూనియన్‌ నెరవేరస్తుందని రాష్ట్ర అద్యక్షుడు బి.వెంకట్రావ్‌ పేర్కొన్నారు.

రాష్ట్ర అధ్యక్షుడు బి.వెంకట్రావ్‌
షరతులు లేని వారసత్వ ఉద్యోగాలు సాధిస్తాం
 
నస్పూర్‌ : కార్మికులకు ఇచ్చిన హామీలను టీబీజీకేఎస్‌ యూనియన్‌ నెరవేరస్తుందని రాష్ట్ర అద్యక్షుడు బి.వెంకట్రావ్‌ పేర్కొన్నారు. ఆదివారం న స్పూర్‌ కాలనీ పాత కమ్యూనిటీ హాల్‌ నిర్వహించిన కార్యకర్తల సమావేశానికి ఆయన హాజరై మాట్లాడారు. సీఎం కేసీఆర్‌కు సింగరేణి కార్మికులంటే ఎంతో అభిమానం ఉందన్నారు. సింగరే ణి కార్మికులు సైనికుల కంటే తక్కువ కాదని దసరా పండుగ కానుకగా కార్మికులకు వారసత్వ ఉద్యోగాలు, లాభాల ప్రకటించారన్నారు. కార్మికులందరికి షరతులు లేకుండా వారసత్వ ఉద్యోగాలు వచ్చేలా కృషిచేస్తానన్నారు. స్వంత ఇంటిపథకం త్వరలోనే అమలు చేస్తామని హామీ ఇచ్చారు. వీఆర్‌ఎస్‌ డిపెండెంట్లకు అన్యాయం చేసింది ఏఐటీయూసినే అన్నారు. డిస్మిస్‌ కార్మికులకు అవకాశం కల్పించడానికి యాజమాన్యంలో చర్చిస్తామని తెలిపారు. వీఆర్‌ఎస్‌ కార్మికులను రెచ్చగొట్టి ఆందోళనా కార్యక్రమాలు చేపిస్తున్నారని ఆరోపించారు. ఏఐటీయూసీ నాయకులు ఏం సాధించారని కార్మికుల నుంచి చందాలు వసూలు చేస్తున్నారో కార్మికులు వారిని ప్రశ్నించాలని కోరారు. వారసత్వ ఉద్యోగాలు కార్మికుల వారసులకే కాకుండా సింగరేణేతరుకు కూడా కల్పించాలని కోరుతూ ఏఐటీయూసీ హైకోర్టుకు వెళ్లి కార్మికుల వారసులకు అన్యాయం చేయడానికి ప్రయత్నిస్తుందన్నారు. కార్మికుల పక్షానæ పోరాడుతున్న టీబీజీకెఎస్‌పై జాతీయ సంఘాలు అర్థం లేని ఆరోపణలు చేస్తున్నాయన్నారు. నేటి నుంచి హైదరాబాద్‌లో నిర్వహించే సమావేశాల్లో వారసత్వ ఉద్యోగాల విధివిధానాలపై చర్చించనున్నట్లు తెలిపారు. కార్మికుల హక్కుల సాధనకోసం పోరాడుతున్న టీబీజీకేఎస్‌ను రానున్న ఎన్నికల్లో భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. 
 
భారీగా చేరికలు
శ్రీరాంపూర్‌ ఏరియాలోని వివిధ గనులకు చెంది న సుమారు 200మంది ఏఐటీయూసీ నాయకు లు కార్యకర్తలు ఆదివారం టీబీజీకేఎస్‌లో చేరా రు. ఆర్కే–7 ఏఐటీయూసీ మాజీ పిట్‌ కార్యద ర్శి అశోక్‌తోపాటు మరికొంత మంది యూని యన్‌లో చేరారు. యూనియన్‌లో చేరుతున్న నా యకులు కార్యకర్తలకు టీబీజీకేఎస్‌ రాష్ట్ర అధ్యక్షుడు బి.వెంకట్రావ్, ప్రధాన కార్యదర్శి కెంగర్ల మల్లయ్య, ఉపాధ్యక్షుడు మిర్యాల రాజిరెడ్డిలు కండువాలను కప్పి యూనియన్‌లోకి ఆహ్వానిం చారు. ఈ సమావేశంలో టీబీజీకెఎస్‌ కేంద్ర నా యకులు సారంగపాణి, ఏనుగు రవీందర్‌రెడ్డి, ఏరియా ఉపాధ్యక్షుడు కె.సురేందర్‌రెడ్డి, నాయకులు పెద్దపల్లి కోటిలింగం, బంటు సారయ్య, రమేష్, పానుగంటి సత్తయ్య, వీరభద్ర య్య, మల్లారెడ్డి, కానుగంటి చంద్రయ్య, పోశెట్టి, అశోక్, ఎంపీపీ సత్యనారాయణ, సర్పంచులు రాజేంద్రపాణి, శంకర్, కిష్టయ్య పాల్గొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement