ఆంధ్ర రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి, ఆంధ్ర కేసరి టంగుటూరి ప్రకాశం పంతులు 142వ జయంతి వేడుకలను శనివారం స్థానిక ఆంధ్ర ప్రదేశ్ భవన్‌లో ఘనంగా నిర్వహించారు.
సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్ర రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి, ఆంధ్ర కేసరి టంగుటూరి ప్రకాశం పంతులు 142వ జయంతి వేడుకలను శనివారం స్థానిక ఆంధ్ర ప్రదేశ్ భవన్‌లో ఘనంగా నిర్వహించారు. ఏపీ భవన్ వద్ద ఉన్న టంగుటూరి విగ్రహానికి నివాళులు అర్పించిన అనంతరం భారత ఎన్నికల మాజీ కమిషనర్ జి.వి.జి.కృష్ణమూర్తి ఈ వేడుకలను ప్రారంభించారు. ఈ సందర్భంగా అంబేద్కర్ ఆడిటోరియంలో జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ పంతులు గారితో, గాంధీజీతో తాను గడిపిన చిన్న నాటి రోజులను గుర్తు తెచ్చుకున్నారు.
రాజ్యసభ సభ్యుడు జేడీ శీలం మాట్లాడుతూ ప్రకాశం పంతులు తెలుగువారు గర్వించదిగన మహనీయుడని పేర్కొన్నారు. టంగుటూరి జయంతిని రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర పండుగగా జరుపుకోవడం సంతోషకరమని ఏపీ భవన్ రెసిడెంట్ కమిషనర్ సతీష్ చంద్ర పేర్కొన్నారు. ఏపీ భవన్ ప్రత్యేకాధికారి అర్జ శ్రీకాంత్ ప్రారంభోపాన్యాసం చేస్తూ సైమన్ కమిషన్ గో బ్యాక్ అంటూ తెలుగు వారి సాహసాన్ని చూపారని టంగుటూరిని కొనియాడారు. ఈ కార్యక్రమానికి దేశ రాజధానిలోని వివిధ తెలుగు సంస్థల ప్రతినిధులు మణినాయుడు, ఎస్.వి.ఎల్.నాగరాజు, సుశీలాదేవి, సత్యప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. సభ అనంతరం నిర్వహించిన రక్తదాన శిబిరంలో పలువురు రక్తదానం చేశారు.