మాజీ స్పీకర్‌ కన్నుమూత

Tamilnadu Former Speaker Ph Pandian Passed away - Sakshi

చెన్నై : తమిళనాడు మాజీ అసెంబ్లీ స్పీకర్‌, ఏఐడీఎంకే సీనియర్‌ నేత పీహెచ్‌ పాండియన్‌ (74) శనివారం మృతి చెందారు. గుండె సంబంధిత వ్యాధితో బాధపడుత్ను ఆయన వెల్లూరులోని క్రిస్టియన్‌ మెడికల్‌ కాలేజీ ఆస్పత్రిలో తుది శ్వాస విడిచారు. ఆయన డీఎంకే నుంచి వైదొలిగిన తర్వాత ఎంజీ రామచంద్రన్‌ స్థాపించిన ఏఐడీఎంకే పార్టీ వ్యవస్థాపక సభ్యుల్లో ఒకరిగా చేరారు. చెరన్‌మదేవి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పాండియన్‌ నాలుగుసార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ఈయన 1985 నుంచి 1989 వరకు అసెంబ్లీ స్పీకర్‌గా సేవలు అందించారు. అదేవిధంగా 1999లో తిరునెల్వేలి లోక్‌సభ స్థానం నుంచి పార్లమెంట్‌ సభ్యునిగా గెలుపొందారు. పీహెచ్‌ పాండియన్‌  అసెంబ్లీ స్పీకర్‌గా ఉన్న సమయంలో స్పీకర్‌కు ప్రత్యేకమైన ఆధికారాలు ఉన్నాయంటూ శక్తివంతమైన నిర్ణయాలు తీసుకున్నారు. ఆయన ఏఐడీఎంకే పార్టీకి తన విశేష సేవలను అందించారు. 

Read latest State News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top