పుష్కర ఘాట్‌లో వింత! | surprise in pushkara ghat | Sakshi
Sakshi News home page

పుష్కర ఘాట్‌లో వింత!

Aug 24 2016 12:22 AM | Updated on Oct 8 2018 5:07 PM

మూడో చేతితో కనిపిస్తున్న చిన్నారి - Sakshi

మూడో చేతితో కనిపిస్తున్న చిన్నారి

సోమశిల పుష్కరఘాట్‌లో వింత చోటుచేసుకుంది. ఓ పాపకు స్నానం చేయిస్తుండగా మూడు చేతులు కనిపించాయి.

తెలకపల్లి: కృష్ణా పుష్కరాలు చివరిరోజైన మంగళవారం మహబూబ్ నగర్ జిల్లాలోని ఓ పుష్కరఘాట్‌లో వింత చోటుచేసుకుంది. ఓ కుటుంబానికి చెందిన చిన్నారికి పుణ్యస్నానం చేయిస్తుండగా.. ఆమెకు మూడు చేతులు ఉన్నట్లు కనిపించాయి. దీనిని భక్తులు కృష్ణమ్మ మహత్యమేనని చర్చించుకున్నారు.

మహబూబ్‌నగర్‌ జిల్లా తెలకపల్లి మండల కేంద్రానికి చెందిన టీఆర్‌ఎస్‌ నాయకుడు రెడ్డెపాకుల కృష్ణయ్య తన కుటుంబ సభ్యులతో మంగళవారం సోమశిల పుష్కర ఘాట్‌లోకి వెళ్లి పుణ్యస్నానాలు చేశారు. కృష్ణయ్య తన కూతురు ప్రయాగకు (11నెలలు) ఘాట్‌లో స్నానం చేయిస్తుండగా బయట ఉన్న బంధువులు ఫొటోలు తీశారు. అయితే ఫొటోల్లో పాపకు రెండు చేతుల బదులు మూడు చేతులు కనిపించాయి. ఈ వింతను చూసేందుకు భక్తులు ఆసక్తిచూపారు.

Advertisement
 
Advertisement
Advertisement