సంక్రాంతికి సన్నాహాలు | Sankranthi preparations | Sakshi
Sakshi News home page

సంక్రాంతికి సన్నాహాలు

Jan 12 2014 11:07 PM | Updated on Jul 6 2018 3:36 PM

నవీముంబైలోని వాషి ప్రాంతంలో 14, 15వ తేదీలలో నిర్వహించే సంక్రాంతి సంబరాలకు ఏర్పాట్లు కొనసాగుతున్నాయి.

దాదర్, న్యూస్‌లైన్: నవీముంబైలోని వాషి ప్రాంతంలో 14, 15వ తేదీలలో నిర్వహించే సంక్రాంతి సంబరాలకు ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. సెక్టర్-9(ఏ) ప్రాంగణంలో తెలుగు కళాసమితి ఆధ్వర్యంలో మంగళవారం సాయంత్రం 6 గంటల నుంచి స్థానిక కళాకారులతో వివిధ కార్యక్రమాలను ఏర్పాటు చేశారు. ప్రముఖ కళా దర్శకురాలు కేతవరపు శోభారావు ఆధ్వర్యంలో ‘దశ దిశలా కాంతి-మన తెలుగు సంక్రాంతి’ పేరిట దేశంలోని వివిధ రాష్ట్రాలలో జరుగుతున్న సంక్రాంతి వేడుకల విశేషాలతో ‘డ్యాన్స్ బ్యాలే’ ప్రదర్శించనున్నారు. అంతేకాకుండా ఆటపాటలతో చిన్నారులు, మహిళలు అలరించనున్నారని నిర్వాహకులు తెలిపారు.
 
 15వ తేదీన..
 సాయంత్రం 6 గంటల నుంచి హైదరాబాద్‌కు చెందిన మనీషా కల్చరల్ ఆర్గనైజేషన్‌కు చెందిన సంగీత దర్శకుడు మధు బాపుశాస్త్రి ఆధ్వర్యంలో ‘గ్రాండ్ మ్యూజికల్ మస్తీ’ కార్యక్రమంలో సుమధుర బాల గాయకురాలు, జీ టీవీ లిటిల్ చాంప్ ప్రవస్తీ తదితరులు పాల్గొననున్నారు. అంతేకాకుండా ఈ రెండు రోజుల పాటు జరిగే సంక్రాంతి సంబరాలలో ఆహూతులకు కమ్మటి భోజన ఏర్పాట్లు కూడా చేసినట్లు సమితి అధ్యక్షుడు బండి నారాయణ రెడ్డి, ప్రధాన కార్యదర్శి మాది రెడ్డి కొండారెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement