సల్మాన్ కేసు 13కు వాయిదా | Salman case 13 to be postponed | Sakshi
Sakshi News home page

సల్మాన్ కేసు 13కు వాయిదా

Jul 1 2015 11:21 PM | Updated on Apr 3 2019 6:23 PM

‘హిట్ అండ్ రన్’ కేసులో పడిన ఐదేళ్ల జైలుశిక్షను సవాలు చేస్తూ బాలీవుడ్ నటుడు సల్మాన్‌ఖాన్ దాఖలు చేసిన అప్పీలు విచారణను బాంబే హైకోర్టు జూలై 13కు వాయదా వేసింది...

ముంబై: ‘హిట్ అండ్ రన్’ కేసులో పడిన ఐదేళ్ల జైలుశిక్షను సవాలు చేస్తూ బాలీవుడ్ నటుడు సల్మాన్‌ఖాన్ దాఖలు చేసిన అప్పీలు విచారణను బాంబే హైకోర్టు జూలై 13కు వాయదా వేసింది. సల్మాన్ న్యాయవాది అమిత్ దేశాయ్ విజ్ఞప్తి మేరకు కోర్టు ఈ నిర్ణయం తీసుకుంది. ‘పేపర్‌బుక్’ (ఆధారాలు, పత్రాల నివేదిక)ను ఇరుపక్షాలకు కోర్టు ఇదివరకే అందజేసింది.

అయితే డాక్యుమెంట్లు సరిగ్గా ఉన్నాయో లే దో సరిచూసుకోడానికి మూడువారాల గడువు ఇవ్వాలని కోర్టుకు అమిత్ విజ్ఞప్తి చేశారు. డాక్యుమెంట్లలో ఏవైనా వేరే భాషల్లో ఉంటే వాటిని ఇంగ్లిష్‌లోకి అనువదించుకోవాల్సి ఉంటుందని కోర్టుకు తెలిపారు. ఆధారాలు పోగొట్టుకు పోయాయేమో సరిచూసుకోవాల్సి ఉంటుందని చెప్పారు. దీనిపై స్పందించిన జస్టిస్ ఏఆర్ జోషీ.. డాక్యుమెంట్లను సరిచేసుకునేందుకు జూలై 13 వరకు గడువిచ్చారు.

Advertisement
 
Advertisement
Advertisement