ఆర్టీసీ డ్రైవర్ ఆత్మహత్య | rtc driver commits suicide in nalgonda district | Sakshi
Sakshi News home page

ఆర్టీసీ డ్రైవర్ ఆత్మహత్య

Sep 12 2016 2:31 PM | Updated on Nov 6 2018 8:04 PM

కుటుంబ కలహాల నేపథ్యంలో ఓ ఆర్టీసీ డ్రైవర్ ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.

రాజుపేట: కుటుంబ కలహాల నేపథ్యంలో ఓ ఆర్టీసీ డ్రైవర్ ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన నల్లగొండ జిల్లా రాజుపేట మండలం బేగంపేట గ్రామ శివారులో సోమవారం వెలుగు చూసింది. గ్రామానికి చెందిన మూల రాజు యాదగిరిగుట్ట ఆర్టీసీ డిపోలో డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. ఈరోజు ఇంట్లో ఎవరు లేని సమయంలో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. విషయం తెలుసుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించి దర్యాప్తు చేస్తున్నారు. కుటుంబ కలహాల నేపథ్యంలోనే ఆత్మహత్య చేసుకున్నాడా.. లేక మరేదైనా కారణం ఉందా అనే కోణంలో పోలీసులు దృష్టి సారిస్తున్నారు. 

Advertisement
 
Advertisement
Advertisement