నిడదవోలులో భారీ చోరీ | robbery in nidadavolu | Sakshi
Sakshi News home page

నిడదవోలులో భారీ చోరీ

Oct 8 2016 10:59 AM | Updated on Aug 30 2018 5:27 PM

పశ్చిమగోదావరి జిల్లా నిడదవోలులో శుక్రవారం రాత్రి చోరీ జరిగింది.

నిడదవోలు : పశ్చిమగోదావరి జిల్లా నిడదవోలులో శుక్రవారం రాత్రి చోరీ జరిగింది. స్థానిక ఇందిరానగర్‌కు చెందిన మద్ది సూరిబాబు కుటుంబసభ్యులు ఇంటికి తాళం వేసి బంధువుల ఇంటికి వెళ్లారు. ఇదే అదనుగా భావించిన దుండగులు ఇంట్లోకి ప్రవేశించి బీరువాలో ఉన్న 10 కాసుల బంగారు ఆభరణాలతోపాటు రూ.70వేల నగదు అపహరించుకుని పోయారు. శనివారం ఉదయం మద్ది సూరిబాబు ఇంటికి చేరుకోగా... చోరీ జరిగినట్లు గుర్తించాడు.  దీంతో అతడు పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement