ఉద్యోగాల పేరుతో రప్పించి వ్యభిచారం.. | police raids on prostitution centres in bangalore | Sakshi
Sakshi News home page

ఉద్యోగాల పేరుతో రప్పించి వ్యభిచారం..

May 9 2016 1:40 PM | Updated on Sep 17 2018 6:26 PM

ఉద్యోగాల పేరుతో రప్పించి వ్యభిచారం.. - Sakshi

ఉద్యోగాల పేరుతో రప్పించి వ్యభిచారం..

ఉద్యోగాల పేరుతో ఇతర రాష్ట్రాలకు చెందిన యువతులను రప్పించి ఓ లాడ్జిలో నిర్వహిస్తున్న వేశ్యావాటికపై ఆదివారం సీసీబీ పోలీసులు దాడిచేశారు.

బెంగళూరు : ఉద్యోగాల పేరుతో ఇతర రాష్ట్రాలకు చెందిన యువతులను రప్పించి ఓ లాడ్జిలో నిర్వహిస్తున్న వేశ్యావాటికపై ఆదివారం సీసీబీ పోలీసులు దాడిచేశారు. ఈ దాడుల్లో ఆరుగురిని అరెస్ట్ చేశారు.

 మైసూరురోడ్డులోని ఎస్‌టీపేటేలో లాడ్జ్‌లో కోల్‌కత్తా, మైసూరుకు చెందిన యువతులతో వేశ్యవాటిక నిర్వహిస్తున్నట్లు పక్కా సమాచారంతో సీసీబీ పోలీసులు దాడి నిర్వహించారు. ఉత్తరకన్నడ జిల్లాకు చెందిన మంజునాథ్, మండ్య నివాసి మహేశ్, బెంగళూరుకు చెందిన రఘు, ఆశ్రీప్‌ఆలీ, తుమకూరు నివాసి ధర్మేంధ్రకుమార్, బీహార్ కు చెందిన చాంద్‌ను  అరెస్ట్ చేశారు. వీరి వద్ద నుంచి రూ.8 వేల నగదు, ఐదు సెల్‌ఫోన్లు, ఇతర వస్తువులు స్వాధీనం చేసుకున్నారు. కోల్ కతాకు చెందిన నలుగురు మహిళలతో పాటు మైసూరు కు  చెందిన ఓ మహిళను రక్షించారు.

 

Advertisement
 
Advertisement
Advertisement