పార్లమెంట్ ఎన్నికల్లో అన్నాడీఎంకేను ఆదరించి రాష్ట్రాభివృద్ధికి తమ వంతు సాయం అందించాలని రాష్ట్ర మంత్రి రమణ ప్రజలకు పిలుపునిచ్చారు.
పార్లమెంట్ ఎన్నికల్లో ఆదరించండి: మంత్రి
Jan 21 2014 3:41 AM | Updated on Sep 2 2017 2:49 AM
తిరువళ్లూరు, న్యూస్‌లైన్: పార్లమెంట్ ఎన్నికల్లో అన్నాడీఎంకేను ఆదరించి రాష్ట్రాభివృద్ధికి తమ వంతు సాయం అందించాలని రాష్ట్ర మంత్రి రమణ ప్రజలకు పిలుపునిచ్చారు. తిరువళ్లూరు జిల్లా కల్యాణకుప్పం గ్రామంలో అన్నాడీఎంకే ఆధ్వర్యంలో భారీ బహిరంగ ఏర్పాటు చేశారు. సమావేశానికి యూనియన్ కార్యదర్శి చంద్రశేఖర్ అధ్యక్షత వహించగా, ముఖ్య అతిథిగా రాష్ట్ర మంత్రి రమణ, విశిష్ట అతిథిగా ఎమ్మెల్యే మణిమారన్ హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి రమణ మాట్లాడుతూ, రాష్ట్రాన్ని డీఎంకే పార్ట్టీ, కరుణానిధి కుటుంబం దోచుకుని వందేళ్ల అభివృద్ధిలో వెనక్కు నెట్టారని ఆరోపించారు.
తమ పార్టీ ఎన్నికల్లోప్రకటించిన హామీలను నిలబెట్టుకునే విధంగా వాటికి కట్టుబడి వుంటామని రమణ వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో అన్నాడీఎంకే ఆదర్శవంతమైన పాలన అందిస్తే, డీఎంకే అవినీతివంతమైన పాలన అందించిందన్న విషయాన్ని గుర్తుంచుకోవాలని ఆయన పిలుపు నిచ్చారు. పార్లమెంట్ ఎన్నికల్లో అన్నాడీఎంకేను ఆదరిస్తే తాము మరింత అభివృద్ధి చేస్తామని మంత్రి రమణ హామీ ఇచ్చారు. రాష్ట్రాన్ని డీఎంకే కబంధ హస్తాల నుంచి కాపాడుకోవడానికి అన్నాడీఎంకే పార్టీ నేతలతో పాటు ప్రజలు అప్రమత్తంగా వ్యవహరించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో పార్టీ నేతలు, ప్రజాప్రతినిధులు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
Advertisement
Advertisement