బడిపంతులుకు బడితెపూజ | Parents Manhandled School Teacher | Sakshi
Sakshi News home page

బడిపంతులుకు బడితెపూజ

Apr 21 2018 8:50 AM | Updated on Oct 8 2018 3:07 PM

Parents Manhandled School Teacher - Sakshi

మద్యం మత్తులో ఉన్న ఉపాధ్యాయుడు  నారాయణ మండంగి     

మల్కన్‌గిరి : స్థానిక సమితిలోని పెద్దకొండ గ్రామం ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుడికి గ్రామస్తులు శుక్రవారం బడితె పూజ చేశారు. వివరాలిలా ఉన్నాయి. 13సంవత్సరాలుగా గ్రామంలోని పాఠశాలలో నారాయణ మండంగి ప్రధానోపాధ్యాయునిగా పని చేస్తున్నారు. ఆయన పాఠశాలకు ప్రతిరోజూ రారు. వచ్చినప్పుడు మద్యం తాగి రావడం, వంటిపై బనియన్‌తో మాత్రమే ఉండడం, మద్యం మత్తులో విద్యార్థులను తిట్టడం, కొట్టడం చేస్తుండే వాడు. పిల్లలు ఇంట్లో చెబితే తల్లిదండ్రులు పాఠశాలకు వచ్చి అడుగుతున్నా పట్టించుకోవడం లేదు.

అలాగే ప్రధానోపాధ్యాయుడు శుక్రవారం కూడా ఓ విద్యార్థిని బాగా కొట్టడంతో గ్రామస్తులంతా కలిసి పాఠశాలకు వచ్చి ప్రధానోపాధ్యాయుడిని కర్రతో చితక్కొట్టారు.  అనంతరం మల్కన్‌గిరి డీఈఓ కార్యాలయానికి ఉపాధ్యాయుడిని తీసుకుని వెళ్లారు. డీఈఓ కార్యాయలంలో లేకపోవడంతో కలెక్టరేట్‌కు తీసుకువెళ్లి ఫిర్యాదు చేశారు. దీనిపై కటెక్టర్‌ మనీష్‌ అగర్వాల్‌ మాట్లాడుతూ మందు ఆయన్ని ఆస్పత్రికి తీసుకువెళ్లి మెడికల్‌ టెస్టులు చేయించాలని, తరువాత ఉపాధ్యాయుడిపై చర్యలు తీసుకుంటానని గ్రామస్తులకు తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement