పాలికె ఎన్నికల ప్రక్రియ పై హైకోర్టు స్టే | Palike election high court stay | Sakshi
Sakshi News home page

పాలికె ఎన్నికల ప్రక్రియ పై హైకోర్టు స్టే

Apr 21 2015 2:31 AM | Updated on Sep 3 2017 12:35 AM

రాష్ట్ర ప్రభుత్వానికి రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానంలో సోమవారం తాత్కాలిక ఊరట లభించింది...

ప్రభుత్వానికి తాత్కాలిక ఊరట
సాక్షి, బెంగళూరు:
రాష్ట్ర ప్రభుత్వానికి రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానంలో సోమవారం తాత్కాలిక ఊరట లభించింది. వివరాలు.. బృహత్ బెంగళూరు మహానగర పాలికె ఎన్నికల ప్ర క్రియ మే 30 లోపు పూర్తి చేయాలని జస్టిస్ నాగరత్నతో కూడిన ఏకసభ్య పీఠం వెలువరించిన తీర్పును ప్రశ్నిస్తూ రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేసిన విషయం తెల్సిందే. ఈ కే సును  హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి వ ఘేలా, రామమోహన్‌రెడ్డిలతో కూడిన బెంచ్ బుధవారం విచారణ చేసింది.

ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్ వాదనలు వినిపించారు. బీబీఎంపీను ప్రభుత్వం ఇప్పటికే సూపర్ సీడ్ చేసింది. ఐఏ ఎస్ అధికారి విజయ్‌భాస్కర్ బీబీ ఎంపీ పాలనా వ్యవహారాలు చూస్తున్నారు. బీబీఎంపీ విభజన విషయమై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక సమావేశాలు నిర్వహిస్తోంది. ఏకసభ్య పీఠం ఆదేశం మేరకు మే 30లోపు ఎన్నికల ని ర్వహణ అసాధ్యం. అందువల్ల ఏకసభ్య పీఠం ఇచ్చిన తీర్పును కొట్టివేయా లి.’ అని హైకోర్టుకు విన్నవించారు.  ఇక రాష్ట్ర ఎ న్నికల కమిషన్ తరఫున ఫణీంద్ర వాదిస్తూ...ఎ న్నికల ప్రక్రియకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకుందన్నారు.

సోమవారం సాయంత్రం 4:30 గంటలకు నోటిఫికేషన్ విడుదల చేస్తుందన్నారు. అందువల్ల ఏకసభ్య పీ ఠం ఇచ్చిన తీర్పును కొట్టి వేయాల్సిన అవసరం కాని, లేదా స్టే ఇవ్వాల్సిన అవసరం కాని లేదన్నా రు. వాదోపవాదాలు విన్న న్యాయస్థానం ఏకసభ్య పీ ఠం ఇచ్చిన తీర్పుపై స్టే ఇస్తూ కేసు విచారణను బుధవారానికి వాయిదా వేసింది. అంతేకాక అంతవర కు బీ బీఎంపీ ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటించకూడదని రాష్ట్ర ఎన్నికల కమిషన్‌కు సూచించింది.

Advertisement
 
Advertisement
Advertisement