ఎన్నారై విద్యార్థి అన్మోల్ శర్న(21) హత్య కేసులో విచారణ ఎదుర్కొంటున్న ఇద్దరు నిందితులు శనివారం బెయిల్ కోసం పిటిషన్ వేశారు.
ఎన్నారై విద్యార్థి హత్య కేసులో బెయిల్‌కు మరో ఇద్దరి పిటిషన్
Oct 5 2013 11:48 PM | Updated on Jul 30 2018 8:27 PM
న్యూఢిల్లీ: ఎన్నారై విద్యార్థి అన్మోల్ శర్న(21) హత్య కేసులో విచారణ ఎదుర్కొంటున్న ఇద్దరు నిందితులు శనివారం బెయిల్ కోసం పిటిషన్ వేశారు. కాగా ఈ పిటిషన్ సోమవారం విచారణకు రానుంది. నిందితులు మాధవ్ భండారీ, ప్రనిల్ షా ఇంతకుముందు కూడా బెయిల్ కోసం పిటిషన్ వేయగా వారిపైన ఉన్న ఫిర్యాదులు బలమైనవని భావిస్తూ ఢిల్లీ కోర్టు పిటిషన్‌ను తిరస్కరించింది. మళ్లీ ఇప్పుడు వారిద్దరూ బెయిల్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. గత నెల 13వ తేదీన తన స్నేహితుడి ఫ్లాట్‌లో జరిగిన డ్రగ్ పార్టీకి హాజరైన అన్మోల్ శర్న అర్ధరాత్రి తర్వాత గొడవ చేస్తుండటంతో సెక్యూరిటీ గార్డులిద్దరూ అతడిని చితకబాది బయటకు తోసేశారు. అనంతరం శర్న అనుమానస్పదస్థితిలో మరణించాడు. అన్మోల్ తన హైస్కూల్ విద్యను న్యూయార్క్‌లో పూర్తిచేశా డు. పైచదువుల కోసం కెనడా వెళ్లాల్సి ఉండగా, డ్రగ్‌పార్టీ అనంతరం మృతి చెందాడు.
Advertisement
Advertisement