ఎడ్లబండిలో నవవధూవరుల షికారు

New Couple Protest On Petrol Price Hikes in Tamil Nadu - Sakshi

సాక్షి ప్రతినిధి, చెన్నై: తమిళనాడు కన్యాకుమారి జిల్లా కరుంగల్‌కు చెందిన పొన్‌ షోజిన్‌రాజ్‌ సౌదీ అరేబియాలో ఉద్యోగం చేస్తున్నాడు. ఇతనికి తిక్కనంగాడుకు చెదిన పొన్నిట్ర అనే ఉపాధ్యాయురాలితో బుధవారం ఉదయం వివాహం జరిగింది. పెళ్లికాగానే నవవధూవరులు కరుంగల్‌లోని వరుడి ఇంటికి చేరుకున్నారు. అదేరోజు సాయంత్రం వివాహ రిసెప్షన్‌ కోసం వధూవరులు కల్యాణమండపానికి వెళ్లేందుకు జోడెద్దుల బండిని పిలిపించుకున్నారు. బండి ముందువైపు కేరళ వాయిద్యాలు, నృత్యాలు సాగుతుండగా ఊరేగింపుగా బయలుదేరారు.ఇదేం చోద్యమని పలువురు ప్రశ్నించగా పెరిగిపోతున్న పెట్రోలు ధరలకు నిరసనగా తానే ఈ ఏర్పాటు చేసినట్లు కాంగ్రెస్‌ నేతైన వరుడి తండ్రి జవాబిచ్చాడు. పెట్రోలు, డీజిల్‌ ధరలు ఇలాగే పెరిగిపోతే మరికొంతకాలానికి ఎడ్లబండే దిక్కు అనే సందేశాన్ని కేంద్రానికి ఇవ్వడానికే ఈ ఊరేగింపని అన్నాడు.

Read latest State News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top