మోదీ ‘మనసులో మాట’పై పుస్తకం | Narendra Modi’s ‘Mann ki Baat’ compilation launched at World Book Fair | Sakshi
Sakshi News home page

మోదీ ‘మనసులో మాట’పై పుస్తకం

Jan 12 2017 10:36 AM | Updated on Oct 9 2018 4:36 PM

ప్రధాని మోదీ ‘మనసులో మాట’ ప్రసంగాల సంకలనంతో రాసిన పుస్తకం విడుదలయింది.

న్యూఢిల్లీ: ప్రధాని మోదీ నెలవారీ ఆకాశవాణి కార్యక్రమం ‘మనసులో మాట(మన్‌కీ బాత్‌)’ ప్రసంగాల సంకలనంతో రాసిన పుస్తకాన్ని కేంద్ర గిరిజన వ్యవహారాల మంత్రి జువల్‌ ఓరం బుధవారం ఇక్కడ ప్రపంచ పుస్తక ప్రదర్శనలో ఆవిష్కరించారు. ఆకాశవాణిలో 2014 అక్టోబర్‌ 3 నుంచి 2016 నవంబర్‌ 27 వరకు ప్రసారమైన అన్ని ఎపిసోడ్‌లను యూపీలోని ఫైజాబాద్‌కు చెందిన 29 ఏళ్ల పరిశోధనా విద్యార్థి రాజీవ్‌ గుప్తా ఈ పుస్తకంలో పొందుపరిచారు.

ప్రధాని ప్రసంగా పుస్తక రూపంలో ‘మన్‌కీ బాత్‌’  లను రాతపూర్వకంగా నమోదుచేసిన గుప్తాను మంత్రి ఈ సందర్భంగా ప్రశంసించారు. ‘మన్‌కీ బాత్‌ ఎపిసోడ్‌లు యూట్యూబ్, దూరదర్శన్‌ వెబ్‌సైట్లలో అందుబాటులో ఉన్నా ,ప్రజలు తీరిక సమయంలో చదివేలా వాటిని పుస్తకరూపంలో తీసుకురావడం ఆహ్వానించదగినది’ అని ఓరం అన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement