వెంకన్న సేవలో పలువురు ప్రముఖులు | mukhesh ambani visits tirumala | Sakshi
Sakshi News home page

వెంకన్న సేవలో పలువురు ప్రముఖులు

May 5 2017 11:51 AM | Updated on Nov 9 2018 6:29 PM

వెంకన్న సేవలో పలువురు ప్రముఖులు - Sakshi

వెంకన్న సేవలో పలువురు ప్రముఖులు

తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామి సన్నిధికి పలువురు ప్రముఖులు వచ్చారు.

తిరుమల: తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామి సన్నిధికి పలువురు ప్రముఖులు వచ్చారు. ఆయా సేవల సందర్భంగా స్వామిని దర్శించుకున్నారు.​‍ నిజపాద దర్శనంలో స్వామివారిని కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ దంపతులు దర్శించుకున్నారు. ఈయనతో పాటు రాష్ట్ర మంత్రి అయ్యన్నపాత్రుడు స్వామిని దర్శించుకున్నారు.
 
అలాగే అభిషేక సేవలో రిలయన్స్‌ అధినేత ముఖేష్‌ అంబానీ, ఆకాష్‌ అంబానీలు శ్రీవారిని దర్శించుకున్నారు. వీరికి అధికారులు ప్రత్యేక దర్శనం చేయించి లడ్డూ ప్రసాదాలు అందజేశారు. కాగా, టీసీఎస్‌ చైర్మన్ చంద్రశేఖర్ నటరాజన్‌ కూడా స్వామివారిని దర్శించుకున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement