ముంబై మోడల్‌ ప్రీతి జైన్‌ కు ఉపశమనం | model Preeti Jain gets relief from arrest till the date of hearing on June 7th | Sakshi
Sakshi News home page

ముంబై మోడల్‌ ప్రీతి జైన్‌ కు ఉపశమనం

May 22 2017 4:56 PM | Updated on Sep 5 2017 11:44 AM

బాలీవుడ్‌ దర్శకుడు మాధుర్‌ భండార్కర్‌పై హత్యాయత్నం కేసులో దోషిగా తేలిన ముంబై మోడల్‌ ప్రీతి జైన్‌కు అరెస్ట్‌ నుంచి స‍్వల్పకాలిక ఉపశమనం లభించింది.

ముంబయి: బాలీవుడ్‌ దర్శకుడు మాధుర్‌ భండార్కర్‌పై హత్యాయత్నం కేసులో దోషిగా తేలిన ముంబై మోడల్‌ ప్రీతి జైన్‌కు అరెస్ట్‌ నుంచి స‍్వల్పకాలిక ఉపశమనం లభించింది. ఈ నెల 26వరకూ ఆమెను అరెస్ట్‌ చేయరాదని బాంబే హైకోర్టు సోమవారం ఆదేశాలు ఇచ్చింది. తదుపరి విచారణను వచ్చే నెల 7వ తేదీకి వాయిదా వేసింది. ఖౠఘౠ మాధుర్‌ భండార్కర్‌పై హత్యాయత్నం కేసులో ప్రీతి జైన్‌కు  ముంబై సెషన్స్‌ కోర్టు మూడేళ్ల జైలు శిక్ష, రూ. 10 వేల జరిమానా విధించిన విషయం తెలిసిందే.

2005లో భండార్కర్‌ను హత్యచేసేందుకు గ్యాంగ్‌స్టర్‌ అరుణ్‌ గావ్లీ సన్నిహితుడు నరేశ్‌ పరదేశీతో రూ.75 వేలకు ప్రీతి ఒప్పందం కుదుర్చుకున్నారు. అయితే పరదేశీ పని పూర్తి చేయకపోవటంతో డబ్బులు తిరిగిచ్చేయాలని ఆమె డిమాండ్‌ చేయటంతో ఈ విషయం పోలీసులకు చేరింది. భండార్కర్‌ తనపై అత్యాచారం చేశారని 2004లో కేసు పెట్టిన ప్రీతి 2012లో దాన్ని వాపసు తీసుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement