మిస్డ్ కాల్ వివాహం | Missed Call marriage | Sakshi
Sakshi News home page

మిస్డ్ కాల్ వివాహం

May 31 2015 2:48 AM | Updated on Sep 3 2017 2:57 AM

చెన్నై తిరువొత్తియూరు కాలడిపేట మేట్టు వీధికి చెందిన పన్నీర్ సెల్వం. ఇతని కుమార్తె కలైవాణి (24). ఈమెకు, పన్నీర్ సెల్వం

టీనగర్: చెన్నై తిరువొత్తియూరు కాలడిపేట మేట్టు వీధికి చెందిన పన్నీర్ సెల్వం. ఇతని కుమార్తె కలైవాణి (24). ఈమెకు, పన్నీర్ సెల్వం బంధువు కుమారునికి కొన్నేళ్ల క్రితం వివాహం జరిగింది. రెండేళ్లయినప్పటికీ వీరికి సంతానం కలగలేదు. దీంతో భార్యాభర్తల మధ్య అభిప్రాయభేదాలు ఏర్పడ్డాయి. కొన్ని నెలల క్రితం కలైవాణి భర్తను విడిచి పుట్టింటికి చే రిది. ఈనెల మూడవ తేదీన ఆమె ఇంట్లోనుంచి హఠాత్తుగా మాయమైంది. తిరువొత్తియూరు పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరిపారు. దీంతో ఆమె కన్యాకుమారి జిల్లా, కుళచ్చల్ ప్రాం తంలో వున్నట్లు తెలిసింది. దీంతో తిరువొత్తియూరు పోలీసులు కుళచ్చల్ వెళ్లి స్థానిక పోలీసుల సాయంతో వారున్న చోటును గుర్తించారు.
 
 అక్కడ కలైవాణి, కుళచ్చల్ పండగశాలైపురానికి చెందిన అబుదాగీర్ (28) అనే యువకుడు ఉన్నారు. పోలీసులు వారి వద్ద విచారణ జరపగా తమ మధ్య మిస్డ్‌కాల్‌తో పరిచయం ఏర్పడి ప్రేమగా మారినట్లు తెలిపారు. వారు అక్కడ రిజిస్టర్ వివాహం చేసుకున్నట్లు పేర్కొన్నారు. కలైవాణి తన పేరును ఆలియాగా మార్పుకున్నట్లు తెలిపింది. ఈ విషయం తెలుసుకున్న కలైవాణి బంధువులు కుళచ్చల్ చేరుకున్నారు. ఆమె తల్లిదండ్రులు తమ వెంట రమ్మని ఆమెను కోరారు. అందుకు కలైవాణి సమ్మతించక అబుదాగీర్‌తోనే జీవిస్తానని తెలిపింది. వీరిని తిరువొత్తియూరు కోర్టులో జూన్ రెండవ తేదీన హాజరుపరచనున్నారు.
 

Advertisement
 
Advertisement
Advertisement