breaking news
Kalaivani
-
భర్త వేధింపులపై భార్య ఫిర్యాదు
అన్నానగర్: భర్త వేధింపులపై భార్య తంజా వూరు పోలీసు సూపరింటెండెంట్‌కి ఫిర్యాదు చేసింది. తంజావూరు ముత్తమిళ్ నగర్‌కు చెందిన కలైవాణి (20) మంగళవారం జిల్లా పోలీసు సూపరింటెండెంట్ సెంథిల్‌కుమార్‌కు ఫిర్యాదు చేసింది. అందులో.. నేను ప్రస్తుతం తంజావూరు ముత్తమిళ్‌నగర్‌లో నివసిస్తున్నాను. నా తండ్రి పలు సంవత్సరాల కిందట కుటుంబాన్ని వదలి వెళ్లిపోయాడు. నా సోదరిని మేనమామకు ఇచ్చి వివాహం చేసేందుకు నిర్ణయించారు. వివాహం రోజున నా సోదరి పెళ్లికి ఒప్పుకోకపోవడంతో ప్లస్–2 చదువుతున్న నన్ను బలవంతంగా మేనమామతో వివాహం చేశారు. అతనికి నా కంటే 20ఏళ్లు వయస్సు ఎక్కువ. పెళ్లయినప్పటినుంచి నన్ను బానిసగా ఇంట్లోనే ఉంచి హింసిస్తున్నారు. తరచూ తాగి వస్తూ దాడి చేస్తున్నాడు. ఈ స్థితిలో 25.4.2018న ఇంటి నుంచి బయటికి వచ్చి తంజావూరులో మహిళా హాస్టల్లో ఉంటూ టైలరింగ్ చేస్తూ జీవిస్తున్నాను. అనంతరం న్యాయవాది ద్వారా విడాకులు కోరుతూ నోటీస్ పంపాను. నేను ఉన్న స్థలాన్ని తెలుసుకుని భర్త బంధువులతో వచ్చి నన్ను కిడ్నాప్ చేసి హత్య చేస్తానని బెదిరిస్తున్నట్టు ఫిర్యాదులో పేర్కొన్నారు. తన భర్తపై తగిన చర్యలు తీసుకోవాలని, వివాహానికి ఇచ్చిన కట్నం, నగలతో పాటు తన ఓటర్ ఐడీ, పాఠశాల సర్టిఫికెట్లను తిరిగి ఇప్పించాలని కోరారు. దీనిపై విచారణ జరిపి న్యాయం చేస్తామని పోలీసు సూపరింటెండెంట్ సెంథిల్‌కుమార్ భరోసా ఇచ్చారు. -
మిస్డ్ కాల్ వివాహం
టీనగర్: చెన్నై తిరువొత్తియూరు కాలడిపేట మేట్టు వీధికి చెందిన పన్నీర్ సెల్వం. ఇతని కుమార్తె కలైవాణి (24). ఈమెకు, పన్నీర్ సెల్వం బంధువు కుమారునికి కొన్నేళ్ల క్రితం వివాహం జరిగింది. రెండేళ్లయినప్పటికీ వీరికి సంతానం కలగలేదు. దీంతో భార్యాభర్తల మధ్య అభిప్రాయభేదాలు ఏర్పడ్డాయి. కొన్ని నెలల క్రితం కలైవాణి భర్తను విడిచి పుట్టింటికి చే రిది. ఈనెల మూడవ తేదీన ఆమె ఇంట్లోనుంచి హఠాత్తుగా మాయమైంది. తిరువొత్తియూరు పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరిపారు. దీంతో ఆమె కన్యాకుమారి జిల్లా, కుళచ్చల్ ప్రాం తంలో వున్నట్లు తెలిసింది. దీంతో తిరువొత్తియూరు పోలీసులు కుళచ్చల్ వెళ్లి స్థానిక పోలీసుల సాయంతో వారున్న చోటును గుర్తించారు. అక్కడ కలైవాణి, కుళచ్చల్ పండగశాలైపురానికి చెందిన అబుదాగీర్ (28) అనే యువకుడు ఉన్నారు. పోలీసులు వారి వద్ద విచారణ జరపగా తమ మధ్య మిస్డ్‌కాల్‌తో పరిచయం ఏర్పడి ప్రేమగా మారినట్లు తెలిపారు. వారు అక్కడ రిజిస్టర్ వివాహం చేసుకున్నట్లు పేర్కొన్నారు. కలైవాణి తన పేరును ఆలియాగా మార్పుకున్నట్లు తెలిపింది. ఈ విషయం తెలుసుకున్న కలైవాణి బంధువులు కుళచ్చల్ చేరుకున్నారు. ఆమె తల్లిదండ్రులు తమ వెంట రమ్మని ఆమెను కోరారు. అందుకు కలైవాణి సమ్మతించక అబుదాగీర్‌తోనే జీవిస్తానని తెలిపింది. వీరిని తిరువొత్తియూరు కోర్టులో జూన్ రెండవ తేదీన హాజరుపరచనున్నారు. -
సారవంతంగా... జీవితపు సాగు
ఆమె ఒక సామాన్య రైతు... జీవనం కోసం వ్యవసాయాన్ని ఎంచుకొంది... సేంద్రియ ఎరువులను ఉపయోగించి పత్తి పండించింది... పంట దిగుబడిని రెట్టింపు చేసింది... నేలను మరింత సారవంతం చేసింది... నీటి వాడకాన్ని తగ్గించింది... ఇరవై సంవత్సరాల అవిశ్రాంత కృషి... పనిపట్ల ఉన్న అంకితభావం... ఆమెను గొప్ప రైతుగా మార్చాయి... తమిళనాడు ఈరోడ్ జిల్లా వెల్లితిరుప్పూర్కి చెందినసామాన్య రైతుసామాన్య రైతు ఒక సామాన్య మహిళ. ఇరవై సంవత్సరాల క్రితం భర్త మరణించాడు. అప్పటికి ఆమెకు ముగ్గురు పిల్లలు. వారిని ఒంటి చేత్తో ఎలా పెంచాలో ఆమెకు అర్థం కాలేదు. పెద్దగా చదువుకోలేదు కనుక, పెద్ద పెద్ద ఉద్యోగాలు చేసే శక్తి లేదు. కాని కళ్ల ముందు ముగ్గురు పిల్లల భవిష్యత్తు, బాధ్యత కదలాడుతున్నాయి. వారిని ఎలా పెంచాలో ఆమెకు పాలుపోలేదు. ఆ సమయంలో రోజు గడవడం కోసం వ్యవసాయాన్ని వృత్తిగా ఎంచుకుంది. మామూలుగా వ్యవసాయం చేయడమంటే చాలా ఖర్చుతో కూడుకున్న పని. మరి ఆమె దగ్గర అంత ధనం లేదు. వ్యవసాయం ఎలా చేయాలో ఆమెకు పాలుపోలేదు. ఇంతలో కొందరు వ్యక్తుల ద్వారా, సేంద్రియ ఎరువులను ఉపయోగించి పంట దిగుబడిని పెంచవచ్చునని తెలుసుకుంది. పత్తి పంట పండిస్తే లాభాలు అధికంగా వస్తాయని తెలుసుకుంది. సేంద్రియ ఎరువులను తీసుకువచ్చి తన పొలంలో వేసింది. నేలను సారవంతం చేసింది. పత్తి విత్తనాలు జల్లింది. ఊహించని విధంగా పంట ఏపుగా పెరిగి, దిగుబడి మూడు రెట్లు అధికంగా వచ్చింది. ఆమె ఆనందానికి అవధులు లేవు. తన కష్టాలు ఇక గట్టెక్కినట్లే అనుకుంది. సేంద్రియమే ఎందుకంటే... సేంద్రియ ఎరువుల వినియోగానికి అధికంగా డబ్బు వెచ్చించనక్కరలేదు. కాని దిగుబడి మాత్రం అధికంగా ఉంటోంది. అందువల్ల కలైవాణి గత కొన్ని సంవత్సరాలుగా తన దృష్టిని సేంద్రియ ఎరువులు ఉపయోగించి పత్తిని పండించడం మీదే కేంద్రీకరించింది. తరచుగా పత్తి రైతుల ఆత్మహత్యల గురించి వింటున్న నేపథ్యంలో ఈమె పత్తిని ఎంచుకోవడం సాహసమే అని ఎవరైనా అంటే, ‘‘సేంద్రియ విధానంలో పత్తి పండిస్తే, దీనిని మించిన లాభసాటి వ్యాపారం లేదు. పంచగవ్య, జీవామృతం... ఈ రెండింటిలోనూ ఆవు పేడ ప్రధాన వస్తువు. వీటి వాడకం వలన కేవలం పంట దిగుబడి పెరగడమే కాకుండా, భూమి మరింత సారవంతమవుతుంది. వీటి తయారీకి ఏమంత పెద్ద ఖర్చు కాదు. జంతువుల విసర్జకాలను సేకరించి, ఎరువులు తయారుచేసి పంటలకు వినియోగించి పంట దిగుబడిని పెంచుకోవచ్చు’’ అని అందరికీ విజ్ఞానాన్ని పంచుతోంది కలైవాణి. ఖర్చు తక్కువ... గిరాకీ ఎక్కువ... పత్తి పంట ఆరునెలలలో దిగుబడికి వస్తుంది. పంట వేసిన ఒకటిన్నర నెలలకే చెట్టు పూతకు వస్తుంది. రెండు నెలలకు కాయ రూపంలోకి మారుతుంది. నాలుగు నెలలు పూర్తయ్యాక కాయలు నెమ్మదిగా పగలడం ప్రారంభమవుతుంది. ఆ తరువాత కొన్ని రోజులకు పత్తి చేతికి వస్తుంది. రసాయన ఎరువులు ఉపయోగించి పండించిన పత్తి కంటె, సేంద్రియ ఎరువులతో పండించిన పత్తికి గిరాకీ ఎక్కువగా ఉంటుంది. రసాయన ఎరువులను ఉపయోగించి పండించిన పత్తి కేవలం ఆరు నెలలు మాత్రమే చెడిపోకుండా ఉంటుంది. అదే సేంద్రియ ఎరువులను ఉపయోగించి పండించిన పంట, ఆరు నెలల తరువాత కూడా చెడిపోకుండా ఉంటుంది. అందువల్ల అధిక పత్తి... అధిక లాభం... మరొక లాభం కూడా ఉంది. ఈ సేంద్రియ ఎరువులను ఉపయోగించడం వల్ల భూమి సారవంతం కావడమే కాకుండా, నీటి వినియోగం కూడా బాగా తగ్గుతుంది’’ అని చెప్పే కలైవాణి తీరిక సమయాలలో అనేక గ్రామాలకు వెళ్లి సేంద్రియ పద్ధతిలో వ్యవసాయం చే సే విధానం, వాటి వలన కలిగే లాభాలు... వంటి ఎన్నో విషయాలు చెబుతూ అనేకమందిని చైతన్యవంతుల్ని చేస్తున్నారు. (ఆమెను 098654 85221 నంబరులో నేరుగా సంప్రతించవచ్చు.)