'దేవాదుల పూర్తిచేసి చెరువులు నింపుతాం' | minister harish rao visits komuravelli | Sakshi
Sakshi News home page

'దేవాదుల పూర్తిచేసి చెరువులు నింపుతాం'

Apr 13 2017 4:01 PM | Updated on Sep 5 2017 8:41 AM

గోదావరిపై తుపాకులగూడెం వద్ద బ్యారేజ్‌ నిర్మించి రెండు పంటలకు నీరిస్తామని మంత్రి హరీశ్‌రావు అన్నారు.

సిద్దిపేట: గోదావరిపై తుపాకులగూడెం వద్ద బ్యారేజ్‌ నిర్మించి రెండు పంటలకు నీరిస్తామని మంత్రి హరీశ్‌రావు అన్నారు. గురువారం కొమురవెళ్లి మల్లికార్జున స్వామిని దర్శించుకున్న ఆయన అనంతరం చెరువును పరిశీలించి సాదాబైనామా ధ్రువపత్రాలను పంపిణీ చేశారు. ఆయన వెంట మండలి విప్‌ వెంకటేశ్వర్లు, ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి ఉన్నారు.
 
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ‘‘సాదాబైనామాలతో ఇప్పటివరకు 11 లక్షల మంది రైతులు ప్రయోజనం పొందారు. పైసా ఖర్చు లేకుండా సాదా బైనామా ధ్రువపత్రం, ఆర్‌ఓఆర్‌, టైటిల్‌ డీడ్‌ పంపిణీ చేస్తున్నాం. దేవాదుల మూడో దశ పనులు పూర్తి చేసి చెరువులు నింపుతామని’’  ఆయన తెలిపారు. 

Advertisement
 
Advertisement
Advertisement