ర్యాగింగ్ వల్లే వైద్యవిద్యార్థిని ఆత్మహత్య? | medical student commits suicide, ragging may be reason | Sakshi
Sakshi News home page

ర్యాగింగ్ వల్లే వైద్యవిద్యార్థిని ఆత్మహత్య?

Dec 1 2016 11:59 AM | Updated on Oct 9 2018 7:52 PM

ర్యాగింగ్ వల్లే వైద్యవిద్యార్థిని ఆత్మహత్య? - Sakshi

ర్యాగింగ్ వల్లే వైద్యవిద్యార్థిని ఆత్మహత్య?

తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి జీఎస్ఎల్ మెడికల్ కాలేజి విద్యార్థిని శుభశ్రీ (21) ఆత్మహత్యపై పోలీసులు విచారణ ప్రారంభించారు.

తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి జీఎస్ఎల్ మెడికల్ కాలేజి విద్యార్థిని శుభశ్రీ (21) ఆత్మహత్యపై పోలీసులు విచారణ ప్రారంభించారు. రాజానగరంలోని మెడికల్ కాలేజి హాస్టల్ లో ఉంటున్న శుభ శ్రీ(21) ఎంబీబీఎస్ నాలుగో సంవత్సరం చదువుతోంది. ఆమె హాస్టల్ భవనంపై నుంచి కిందకు దూకి ఆత్మహత్య చేసుకుంది. 
 
వాస్తవానికి నలుగురు విద్యార్థులు తనను ర్యాగింగ్ చేస్తున్నారని రెండు వారాల క్రితం శుభశ్రీ ప్రిన్సిపాల్‌కు ఫిర్యాదు చేసింది. దానిపై విచారణ కమిటీని నియమించినట్లు కళాశాల యాజమాన్యం చెబుతోంది. అయితే.. శుభశ్రీ కొన్నాళ్లుగా మానసికంగా ఇబ్బంది పడుతోందని, ఇంతకు ముందు కూడా రెండుసార్లు ఆత్మహత్య చేసుకునేందుకు ప్రయత్నించిందని తెలిపింది.

Advertisement
 
Advertisement
Advertisement