భర్తను తరమి.. వివాహితపై సామూహిక అత్యాచారం | Married Women Molested By Two Minor boys In Chennai | Sakshi
Sakshi News home page

భర్తను తరమి.. వివాహితపై సామూహిక అత్యాచారం

Oct 12 2018 11:22 AM | Updated on Oct 12 2018 11:23 AM

 Married Women Molested By Two Minor boys In Chennai - Sakshi

ఆలయానికి వెళ్లి వస్తున్న దంపతులను దారికాచి దాడిచేశారు. భర్తను తరిమికొట్టి భార్యపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు.

సాక్షి ప్రతినిధి, చెన్నై: ఆలయానికి వెళ్లి వస్తున్న దంపతులను దారికాచి దాడిచేశారు. భర్తను తరిమికొట్టి భార్యపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ కేసులో నలుగురు అరెస్ట్‌ కాగా, నిందితుల్లో ఇద్దరు 17 ఏళ్ల మైనర్‌ బాలురు కావడం గమనార్హం. వివరాలు ఇలా ఉన్నాయి. తిరువళ్లూరు జిల్లా గుమ్మిడిపూండికి చెందిన ప్రయివేటు కంపెనీ ఉద్యోగి మూడేళ్ల కిత్రం ఒడిశా రాష్ట్రానికి చెందిన యువతి (29)ని మూడునెలల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నాడు. 

ఆమెకు అంతకు ముందే వివాహం కాగా విడాకులు తీసుకుని అతడిని రెండో వివాహం చేసుకుంది. దంపతులు బుధవారం గుమ్మిడిపూండి సమీపంలోని కుమరనాయకన్‌పేటలోని ఆలయానికి వెళ్లి మోటార్‌బైక్‌పై తిరిగి వస్తుండగా గోపాల్‌ కండ్రిగ సమీపంలో రెండు మోటార్‌ సైకిళ్లపై నలుగురు యువకులు అడ్డుకుని భర్తపై దాడిచేసి తరిమికొట్టారు. ఆ తరువాత భార్యకు కత్తిచూపి బెదిరించి దూరంగా మోసుకుని వెళ్లి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు.

 గాయపడిన భర్త సమీపంలోని గ్రామస్తులను వెంటబెట్టుకుని రావడంతో దుండగులు పారిపోయారు. బాధితులు ఇచ్చిన ఫిర్యాదుతో గుమ్మిడిపూండి సిప్‌కాట్‌ పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టగా అదే ప్రాంతానికి చెందిన మోహన్, మునియస్వామి అనే ఇద్దరు యువకులతోపాటు 17 ఏళ్ల వయసుగల ఇద్దరు బాలురు నిందితులని తేలింది. ఆ నలుగురిపై ఐదు సెక్షన్లపై కేసులు పెట్టి గురువారం అరెస్ట్‌ చేశారు. 

Advertisement
 
Advertisement
Advertisement