చెట్టును ఢీకొన్న బైక్: వ్యక్తి మృతి | Man dies of hitting bike to tree | Sakshi
Sakshi News home page

చెట్టును ఢీకొన్న బైక్: వ్యక్తి మృతి

Oct 23 2016 12:06 PM | Updated on Sep 4 2017 6:06 PM

అతివేగంతో వెళ్తున్న ద్విచక్రవాహనం అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న చెట్టును ఢీకొట్టింది.

కోరుట్ల(జగిత్యాల): అతివేగంతో వెళ్తున్న ద్విచక్రవాహనం అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న చెట్టును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఓ వ్యక్తి మృతిచెందగా.. మరో వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి.

ఈ ఘటన జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం చిన్నమెట్టుపల్లి గ్రామ శివారులో ఆదివారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. ఇది గుర్తించిన స్థానికులు క్షతగాత్రుడిని ఆస్పత్రికి తరలించి పోలీసులకు సమాచారం అందించారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
 

Advertisement
 
Advertisement
Advertisement