'ఇంట్లో దెయ్యం నాకేం భయ్యం' చూస్తూ మృతి | man dies due to heart attack in siddipet | Sakshi
Sakshi News home page

'ఇంట్లో దెయ్యం నాకేం భయ్యం' చూస్తూ మృతి

Jan 3 2017 4:31 PM | Updated on Sep 5 2017 12:19 AM

'ఇంట్లో దెయ్యం నాకేం భయ్యం' చూస్తూ మృతి

'ఇంట్లో దెయ్యం నాకేం భయ్యం' చూస్తూ మృతి

సిద్ధిపేట జిల్లా కేంద్రంలోని శ్రీనివాస థియేటర్‌లో ఓ వ్యక్తి మృతిచెందాడు.

సిద్దిపేట: సిద్ధిపేట జిల్లా కేంద్రంలోని శ్రీనివాస థియేటర్‌లో ఓ వ్యక్తి మృతిచెందాడు. ఇంట్లో దెయ్యం నాకేం భయ్యం సినిమా చూస్తూ సదరు వ్యక్తి ప్రాణాలు విడిచాడు. మృతుడు సిద్ధిపేట్‌లోని ఎన్‌టీఆర్‌ నగర్‌కు చెందిన ఎండీ షాదుల్‌(30)గా గుర్తించారు. ఇంటర్‌వెల్‌ సమయంలో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది.  ఈ విషయాన్ని థియేటర్‌ యాజమాన్యం పోలీసులకు తెలియజేసింది.

సంఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి మృతదేహాన్ని సిద్ధిపేట ప్రభుత్వాసుపత్రికి తరలించారు. గుండెపోటుతో మరణించి ఉండవచ్చునని పోలీసులు అనుమానిస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement