వేరే అబ్బాయితో పెళ్లికి సిద్ధమైందని.. | Mahendran murdered his lover in Anna nagar | Sakshi
Sakshi News home page

వేరే అబ్బాయితో పెళ్లికి సిద్ధమైందని..

Jul 7 2017 10:10 PM | Updated on Jul 30 2018 8:37 PM

వేరే అబ్బాయితో పెళ్లికి సిద్ధమైందని.. - Sakshi

వేరే అబ్బాయితో పెళ్లికి సిద్ధమైందని..

వేరే అబ్బాయిని వివాహాం చేసుకోవటానికి సిద్ధమైందని తెలిసి సహించలేక ప్రేయసిని హత్య చేసిన సంఘటన పెన్నాగరం కలకలం రేపింది.

అన్నానగర్‌: తనను ప్రేమించిన అమ్మాయి మరోకరిని వివాహాం చేసుకోవటానికి సిద్ధమైందని తెలిసి సహించలేక ప్రేయసిని హత్య చేసిన సంఘటన పెన్నాగరం సమీపంలో కలకలం రేపింది. వివరాలోకి వెళ్లితే.. సెల్‌రంపట్టికి చెందిన తంగరాజ్‌ కుమార్తె  తమిళా(18) ఈమె ప్లస్‌ 2 ముగించుకుని కళాశాలలో చేరటానికి ఆప్లికేషన్‌  వేసింది. బుధవారం రోజు ఓ బండ మీద తమిళా అనుమానాస్పద   స్థితిలో మృతి చెందింది. తన కుమార్తె చావుపై అనుమానం ఉందని తండ్రి పెన్నాగరం పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు. అదే ప్రాంతానికి చెందిన యువకుడు మహేంద్రన్‌(24) ని అదుపులోకి తీసుకుని రహస్య ప్రాంతలో గురువారం విచారణ చేశారు.


విచారణలో మహేంద్రన్‌.. నేను తమిళా ఇద్దరం ప్రేమించుకుంటూ వచ్చాం. ప్రేమించిన నన్ను కాదని మరోకరికి ఇచ్చి వివాహం చేయించాలని తల్లిదండ్రులు సిద్ధం కాగానే  ఆమె ఒప్పుకున్నట్లుగా తెలిసింది. దీంతో తమిళాకి ఫోన్‌ చేసి ఊరు బయటకి పిలిపించాను. అప్పుడే వేరే అబ్బాయిని పెళ్లి చేసుకోవటానికి సిద్ధమయ్యావా అని  అడిగినప్పపుడు మా మధ్య తగదా ఏర్పడందని చెప్పాడు. ఇంతలో ఆవేశం చెందిన నేను తమిళా చేతులను కట్టివేసి హత్య చేయటానికి ప్రయత్నించాను. ఇంతలో ఆమె సృహా తప్పి కింద పడటం వల్ల గొంతు నులిమి హత్య చేశాను. తరువాత అనుమానం రాకూడని ఆమె నోటిలో విషం పోసి వెళ్లిపోయనని పోలీసుల విచారణలో  ఒప్పుకున్నాడు. యువతి హత్య కేసులో మహేంద్రన్‌ను పోలీసులు అరెస్టు చేసి కోర్టులో హాజరు చేసి సేలం సెంట్రల్‌ జైలుకు పంపించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement