ప్రేమజంట బలవన్మరణం | Love couple commit to suiside | Sakshi
Sakshi News home page

ప్రేమజంట బలవన్మరణం

Feb 14 2017 2:55 AM | Updated on Sep 5 2017 3:37 AM

ప్రేమజంట బలవన్మరణం

ప్రేమజంట బలవన్మరణం

ప్రేమికుల దినోత్సవానికి ముందురోజు విషాదం చోటుచేసుకుంది.

బావతో వివాహం చేశారని ప్రియుడితో కలసి బాలిక అఘాయిత్యం

బొంరాస్‌పేట: ప్రేమికుల దినోత్సవానికి ముందురోజు విషాదం చోటుచేసుకుంది. తమ ప్రేమను పెద్దలు అంగీకరించడం లేదని, బావతో వివాహం చేశారని మనస్తాపం చెందిన ఓ బాలిక ప్రియుడితో కలసి ఆత్మ హత్యకు పాల్పడింది. వికారాబాద్‌ జిల్లా బొంరాస్‌పేట మండలం దుద్యాల  శివారులో సోమవారం ఈ ఘటన వెలుగుచూసింది. రంగారెడ్డి జిల్లా షాద్‌ నగర్‌ డివిజన్‌ నందిగామ మండలం పిట్టల గూడేనికి చెందిన గంగిశెట్టి సత్తయ్య  రెండో కుమారుడు మధు(23) స్థానికంగా ఓ కూర గాయల నర్సరీ నిర్వహిస్తున్నాడు. అదే గ్రామానికి చెందిన వన్పలి చెన్నయ్య, నిర్మల దంపతుల ఏకైక కూతురు అఖిల(16) కొంతకాలంగా ప్రేమించుకున్నారు.

గతేడాది నవంబర్‌లో మధు తమ కూతురును కిడ్నాప్‌ చేశాడని అఖిల కుటుంబీకులు కేసు పెట్టడంతో 40 రోజుల పాటు అతడు జైలుశిక్ష అనుభ వించాడు. అఖిల కుటుంబీకులు అదే గ్రామానికి చెందిన ఆమె మేనబావ గంగిశెట్టి మల్లేశ్‌కు ఇచ్చి డిసెంబర్‌లో పెళ్లి చేశారు.    ఈ క్రమంలో ఆదివారం ఉదయం మధు, అఖిల బైక్‌పై బయలుదేరి వికారాబాద్‌ జిల్లా బొంరాస్‌పేట మండలం దుద్యాల శివారులోని కృష్ణగిరి ప్రాంతానికి చేరుకున్నారు. రాత్రి 7.30 గంటలకు కుటుంబసభ్యులకు ఫోన్‌ చేసి ‘మా ప్రేమను కాదంటున్నందుకు ఇద్దరం పారిపోయి వచ్చాం.. ఇక్కడ ఆత్మహత్య చేసుకుం టున్నాం..’అని చెప్పారు. ఇద్దరూ తమతో తీసుకొచ్చిన గుళికల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డారు. మృతదే హాలను కొడంగల్‌ ఆస్పత్రికి తరలించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement