లైంగిక వేధింపులకు జీవితఖైదు | Life term for man for sexually harassing, threatening minor Erode | Sakshi
Sakshi News home page

లైంగిక వేధింపులకు జీవితఖైదు

Mar 15 2016 8:04 PM | Updated on Sep 3 2017 7:49 PM

తమిళనాడు లోని మహిళా కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. మైనర్ బాలిక(15)ను లైంగికంగా వేధించిన కేసులో ధన్హీర్ (30) కు జీవితఖైదు విధిస్తూ కోర్టు తీర్పు చెప్పింది.

చెన్నై: తమిళనాడు లోని మహిళా కోర్టు సంచలన తీర్పు వెలువరించింది.  బాలిక(15)ను లైంగికంగా వేధించిన కేసులో ధన్హీర్ (30) అనే యువకుడికి జీవితఖైదు విధిస్తూ కోర్టు తీర్పు చెప్పింది.  దీంతో పాటుగా బాలికపై  బెదిరింపులకు పాల్పడినందుకు గాను  ఏడు సంవత్సరాల కఠినకారాగారశిక్షను విధించింది. ఈ రెండు  శిక్షలను ఏకకాలంలో అమలు చేయాలని జిల్లా మహిళా కోర్ట్ న్యాయమూర్తి ఎన్ తిరువక్కనరసు  సోమవారం  ఆదేశించారు.

వివరాల్లోకి వెళితే..ఇంటి సమీపంలో నిలబడి  ఉన్న  బాలిక పట్ల  ధన్హీర్ అనుచితంగా  ప్రవర్తించాడు. ఆ చర్యలను బాధితురాలు ప్రతిఘటించడంతో.. ఈ విషయాన్ని ఎవరికైనా చెబితే చంపేస్తానంటూ బెదిరించాడు.  దీంతో  అమ్మాయి తల్లిదండ్రులు గోబిచెట్టిపాల్యం (గోబి) లో  ఫిర్యాదు చేశారు.  ఈ నేపథ్యంలో ధన్హీర్ పై కేసు నమోదు చేసిన మహిళా విభాగం పోలీసులు గత జులైలో అతగాడిని అరెస్ట్ చేశారు.   ప్రాసిక్యూషన్ వాదనలను సమర్థించిన కోర్టు ఈ  తీర్పును వెలువరించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement