నిందితుడిపై పోక్సో కేసు నమోదు
ధర్మపురి: విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పించాల్సిన ఉపాధ్యాయుడు గాడితప్పి ఓ బాలిక (4)పై అత్యాచార యత్నానికి పాల్పడ్డాడు. ఈ ఘటన జగిత్యాల జిల్లా ధర్మపురిలో వెలుగుచూసింది. పోలీసుల కథనం ప్రకారం.. మండలంలోని ఓ గ్రామానికి చెందిన బాలిక ఓ ప్రైవేట్ పాఠశాలలో ఎల్‌కేజీ చదువుతోంది. పాఠశాల ప్రధానోపాధ్యాయుడు చల్లా శ్రీనివాస్ సదరు చిన్నారిని బుధవారం స్టాఫ్‌రూంలోకి తీసుకెళ్లి అత్యాచారయత్నానికి పాల్పడ్డాడు.
విషయాన్ని బాలిక తల్లిదండ్రులకు తెలపగా.. గురువారం తల్లిదండ్రులు, మరికొంతమంది కాలనీవాసులు పాఠశాలకు చేరుకుని హెచ్‌ఎంను నిలదీశారు. పాఠశాలలోని ఫర్నిచర్‌ను ధ్వంసం చేశారు. శ్రీనివాస్‌పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. డీఎస్పీ పురుషోత్తంరెడ్డి, సీఐ రాంనర్సింహరెడ్డి పాఠశాలకు చేరుకుని విచారణ చేపట్టారు. నిందితుడిని అదుపులోకి తీసుకుని పోక్సో, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసినట్లు తెలిపారు.


