లింగాల కేదారి దంపతులు , లక్ష్మి, శరణప్ప (ఫైల్)
హోటల్ అద్దె ఇవ్వడం లేదని తాళం వేసిన బిల్డింగ్ యజమాని కుమారుడు
నయీంనగర్: అద్దె డబ్బులు ఇవ్వడం లేదని హోటల్ భవన యజమాని తిట్టి తాళం వేయడంతో అవమానం భరించలేక లింగాల కేదారి దంపతులు ఆత్మహత్య చేసుకున్నట్టు పోలీసులు తెలిపారు. లింగాల కేదారి కొడుకు పృథ్వీ ఫిర్యాదు మేరకు బిల్డింగ్ యజమాని కుమారుడు రాముపై కేసు నమోదు చేసినట్టు సుబేదారి పోలీసులు గురువారం తెలిపారు. హనుమకొండ నక్కలగుట్టలోని అదాలత్ జంక్షన్ వద్ద అద్దె భవనంలో లింగాల కేదారి దంపతులు కొన్నేళ్లుగా తమ పేరుమీద హోటల్ నడుపుతున్నారు.
అనివార్య కారణాలతో అద్దె చెల్లించడం లేదు. దీంతో భవన యజమాని కుమారుడు బుధవారం హోటల్ వద్దకు వచ్చి కిరాయి ఎందుకు ఇవ్వడం లేదని దూషించి తాళం వేశాడు. దీనిని అవమానంగా భావించిన లింగాల కేదారి దంపతులు సాయంత్రం హోటల్‌లోకి వెళ్లి తాళం తీసి లోనికి వెళ్లి ఒంటిపై పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకున్నారు. లింగాల కేదారి అక్కడికక్కడే చనిపోగా, భార్య పుష్పలతకు తీవ్రగాయాలు కాగా, ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ గురువారం ఉదయం చనిపోయినట్టు వైద్యులు ప్రకటించారు.
కాగా, ఎంతోమందికి ఉచితంగా అన్నం పెట్టిన లింగాల కేదారి మరణవార్త విని అంతిమయాత్రకు ఉమ్మడి వరంగల్ జిల్లా నుంచి అభిమానులు పెద్దసంఖ్యలో తరలివచ్చారు. నగరంలో చదువుకునేందుకు వచ్చిన సమయంలో అతి తక్కువ ధరకు భోజనం పెట్టేవాడని, ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగులుగా పనిచేస్తున్నామని కన్నీరు పెట్టుకున్నారు. లింగాల కేదారి దంపతులకు మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ్‌భాస్కర్ నివాళులరి్పంచారు.
దంపతుల అనుమానాస్పద మృతి
పురుగుల మందు తాగి భార్య...రైలుకు ఎదురెళ్లి భర్త మృతి
తండ్రి కళ్లముందే కొడుకు బలవన్మరణం
ఇరువురి మధ్య గొడవలే కారణం
సికింద్రాబాద్/అడ్డగుట్ట: పెళ్లై పదహారు నెలలు... రాఖీ పండుగకు సొంత ఊరికి వెళ్లి పది రోజుల కిందటే తిరిగి నగరానికి వచ్చారు. అంతలోనే ఏమైందో తెలియదు. దంపతులిద్దరూ ఆత్మహత్యకు పాల్పడ్డారు. భార్య ఇంట్లో పురుగుల మందు తాగి మృతి చెందగా... భర్త రైలుకిందపడి ఆత్మహత్య చేసుకున్న ఘటనలు తార్నాక విజయపురి కాలనీలో విషాదాన్ని నింపాయి. సికింద్రాబాద్ జీఆర్‌పీ ఇన్‌స్పెక్టర్ సాయీశ్వర్‌గౌడ్, లాలాగూడ ఇన్‌స్పెక్టర్ రవి కిరణ్‌లు తెలిపిన వివరాల ప్రకారం... కర్ణాటక రాష్ట్రం గుల్బర్గా జిల్లా అఫ్జల్‌పూర్ గ్రామానికి చెందిన శరణప్ప (28) ఉపాధి కోసం కొద్ది కాలం క్రితం నగరానికి వచ్చి తార్నాక విజయపురి కాలనీలోని ఓ ఇంట్లో భార్య లక్ష్మి, తల్లిదండ్రులతో కలిసి అద్దెకు ఉంటున్నాడు.
శరణప్ప నాచారంలోని ఒక హోటల్‌లో పనిచేస్తూ కుటుంబాన్ని పోషించేవాడు. గురువారం ఉదయం శరణప్ప తండ్రి ధర్మన్న మంగ ఇద్దరూ కలిసి లాలాపేట విజయ డెయిరీ సమీపంలో టీ తాగేందుకు వెళ్లారు. అనంతరం, అక్కడి నుంచి శరణప్ప పనికి వెళ్తున్నానని తన తండ్రికి చెప్పి పట్టాల మార్గం గుండా నాచారం వైపు వెళ్తుండగా ఖర్చుల నిమిత్తం తనకు యాభై రూపాయలు కావాలని తండ్రి శరణప్ప అతడి వెనుకనే వెళ్లాడు. ఈ క్రమంలో మౌలాలి రైల్వే స్టేషన్ అప్‌లైన్ ప్రాంతంలో వేగంగా వస్తున్న రైలుకు ఎదురెళ్లి శరణప్ప ఆత్మహత్య చేసుకున్నాడు. కళ్ల ముందే కొడుకు ఆత్మహత్య చేసుకోవడంతో శోకసంద్రంలో మునిగిపోయాడు. సమాచారం అందుకున్న జీఆర్పీ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతుడి వద్ద గల ఆధార్ కార్డు ఆధారంగా వివరాలు గుర్తించారు.
ఇంట్లో భార్య ఆత్మహత్య
కేసు నమోదు చేసుకున్న జీఆర్పీ పోలీసులు విచారణ సాగించగా మరో ఆత్మహత్య ఘటన వెలుగుచూసింది. శరణప్పకు 16 నెలల క్రితం సొంత జిల్లాకు చెందిన లక్ష్మి (24)తో వివాహం జరిగింది.అప్పటి నుంచి వీరిద్దరిమధ్య ఆర్థిక సమస్యలు, కుటుంబపరమైన గొడవలు ఉన్నట్లు పోలీసులకు బంధువుల ద్వారా సమాచారం అందింది. ఇటీవల రాఖీ పండుగ కోసం దంపతులిద్దరూ కర్ణాటక వెళ్లి పది రోజుల క్రితమే నగరానికి వచ్చారు. ఆ తర్వాత కూడా నిత్యం గొడవలు జరుగుతుండేవని తెలిసింది.
ఇదిలా ఉండగా బుధవారం రాత్రి లక్ష్మి పురుగుల మందు తాగి నిద్రపోయినట్లు పోలీసులు భావిస్తున్నారు. ఉదయం శరణప్ప నిద్రలేచేసరికి విగతజీవిగా పడిఉన్న భార్య లక్ష్మి మృతదేహాన్ని గుర్తించి ఉంటాడని, భార్య మరణంతో మనస్తాపం చెంది ఆత్మహత్యకు పాల్పడి ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. కేసులు నమోదు చేసుకున్న జీఆర్‌పీ, లాలాగూడ పోలీసులు ఇరువురి మృతదేహాలను గాం«దీమార్చురీకి తరలించి దర్యాప్తు చేస్తున్నారు.


