ఏంటయ్యా ఇంట్లోనే కూర్చోమంటున్నారు!

Kamal Haasan Responds On Janata Curfew - Sakshi

సాక్షి, చెన్నై: ఏంటయ్యా ఇంట్లోనే కూర్చోమంటున్నారు. అలా కూర్చుంటే తినడానికి ఎక్కడి నుంచి వస్తుంది? పిల్లల పరీక్షలకు ఫీజులు కట్టాలి. దానికి డబ్బెక్కడి నుంచి వస్తుంది అని ప్రజలు బాధపడుతున్నారా, అవన్నీ చేయాలంటే ఆరోగ్యం ముఖ్యం అని నటుడు కమలహాసన్‌ ప్రజల నుద్దేశించి కరోనాపై అవగాహన కలిగించేలా వీడియోను విడుదల చేశారు. కరోనా ఇప్పుడు ఎవరి నోట విన్నా, ఇదే మాట. ప్రజలను భయకంపితం చేస్తున్న కరోనాను అధికమించడానికి కేంద్రప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు జాగ్రత్తలు తీసుకుంటున్నాయి. అయినా ప్రజలు కరోనా బారిన పడుతూనే ఉన్నారు.

కాగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఇటీవల ప్రజల నుద్దేశించి ప్రసంగించారు. అందులో కరోనా బారిన పడకుండా తీసుకోవలసిన జాగ్రత్తల గురించి వివరించారు. ఈ సందర్భంగా ఆయన 22న జనతా కర్ఫ్యూను విధించారు. ప్రజలెవరూ బయటకు రావద్దని, ఇంట్లోనే గడపాలని చెప్పారు. అయితే ప్రధాని జనతా కర్ఫూకు సర్వత్రా స్వాగతం పలుకుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో నటుడు కమలహాసన్‌ కరోనాపై అవగాహన కలిగించి, వారి భయాన్ని పోగొట్టే విధంగా ఒక వీడియోను శనివారం విడుదల చేశారు. చదవండి: కరోనా నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం 

అందులో ఏమిటయ్యా ఇంట్లోనే కూర్చోమంటున్నారు? ఊరికే కూర్చుంటే  పూట ఎలా గడుస్తుంది? మార్చి, ఏప్రిల్‌లో పిల్లల పరీక్షలకు ఫీజు ఎలా కట్టాలి? దుకాణాలు కూడా బంద్‌ అంటున్నారు. చేతిలో డబ్బు కూడా లేదు ఏం చేయాలని అని చాలా మంది అనుకోవచ్చు. అయితే అవన్నీ చేయాలంటే మీ ఆరోగ్యం బాగుండాలి, అందుకు ఈ జాగ్రత్తలు తీసుకోవాలి. అందుకే ఇంట్లోనే ఉండండి. ఈ రెండు వారాలు కుటుంబసభ్యులతో గడపండి. పుస్తకాలు చదువుకోండి, ఇంట్లో వంటలు కూడా చేయవచ్చు. ఇష్టమైన చిత్రాలను ఇంట్లోనే చూడండి, సంగీతంపై మక్కువ ఉంటే దాన్ని వినండి. ఇంట్లోని పెద్దలతో గడపండి. పిల్లల్ని చదివించుకోండి అని కమలహాసన్‌ ఆ వీడియోలో ప్రజలకు హితవుపలికారు.  చదవండి: కరోనా: పారాసిట్‌మాల్‌తో అద్భుత ఫలితం 

Read latest State News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top