ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్

AP Government Has Taken A Key Decision In Wake Of Corona - Sakshi

సాక్షి, అమరావతి: కరోనా వైరస్‌ నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్ అమలు చేయడంతోపాటు వంతులవారీ పని విధానాన్ని అమలు చేయాలని నిర్ణయించింది. రాష్ట్ర సచివాలయం విభాగాధిపతుల కార్యాలయాలు మొదలు క్షేత్రస్థాయి వరకు ఈ విధానం సోమవారం నుంచి అమల్లోకి రానుంది. ఒక బృందం ఒక వారం కార్యాలయాలకు వచ్చి విధులు నిర్వహిస్తే.. రెండో బృందం తర్వాత వారం విధులకు వచ్చేలా వెసులుబాటు కల్పించింది. అలాగే ప్రభుత్వ కార్యాలయాలకు వచ్చే సందర్శకుల్ని నియంత్రించాలని, అత్యవసర పని ఉంటే తప్ప అనుమతించవద్దని చెప్తోంది. చదవండి: కలి‘విడి’గా కరోనాపై యుద్ధం

రాష్ట్ర సచివాలయంలో సెక్షన్‌ ఆఫీసర్ కంటే పైస్థాయి అధికారులు రోజూ విధులకు హాజరవుతారు. అయితే వీరందరికీ ప్రత్యేకంగా ఉంటాయి. వారంలో విధులకు హాజరయ్యే ఉద్యోగులకు వేర్వేరు సమయాల్లో పనివేళలుగా.. ఒక బృందం ఉ.9.30 గంటలకు, రెండో బృందం 10 గంటలకు, మూడో బృందం 10.30 గంటలకు కార్యాలయంలోనికి అనుమతిస్తూ ఏ సెక్షన్‌లోనూ రద్దీ లేకుండా ఉద్యోగుల మధ్య తగినంత దూరం పాటించేలా ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. కింద స్థాయి ఉద్యోగులకు వంతులవారీ విధానాన్ని ప్రభుత్వం వర్తింపు చేయనుంది.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top