శ్రీవారిని దర్శించుకున్న తెలంగాణ ప్రముఖులు | hyderabad mayor bonthu rammohan visits tirumala | Sakshi
Sakshi News home page

శ్రీవారిని దర్శించుకున్న తెలంగాణ ప్రముఖులు

Feb 21 2017 2:34 PM | Updated on Sep 5 2017 4:16 AM

శ్రీ వెంకటేశ్వరస్వామి వారిని పలువురు ప్రముఖులు మంగళవారం దర్శించుకున్నారు.

తిరుమల: శ్రీ వెంకటేశ్వరస్వామి వారిని పలువురు ప్రముఖులు మంగళవారం దర్శించుకున్నారు. తెలంగాణ ప్రభుత్వ సాంస్కృతిక సలహాదారు రమణాచారి, జీహెచ్‌ఎంసీ మేయర్‌ బొంతు రామ్మోహన్‌ తెల్లవారుజామున వీఐపీ దర్శన సమయంలో శ్రీవారి సేవలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌, మంత్రులు, కుటుంబ సభ్యులతో కలిసి మంగళవారం సాయంత్రం తిరుమలకు చేరుకుంటారని, బుధవారం ఉదయం వీఐపీ దర్శన సమయంలో శ్రీవారిని దర్శించుకుంటారని తెలిపారు. అలాగే తెలంగాణ రాష్ట్రం తరపున మొక్కుకున్న ప్రకారం రూ. 5 కోట్ల విలువైన స్వర్ణాభరణ కానుకలను సీఎం సమర్పించనున్నట్లు చెప్పారు. అక్కడి నుంచి తిరుచానూరు వెళ్లి పద్మావతి అమ్మవారిని కూడా దర్శించుకుంటారన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement