దయచేసి నా భార్యను అప్పగించండి!

Husband Petition on Court Return to Wife Tamil nadu - Sakshi

హైకోర్టులో యువకుడి పిటిషన్‌

చెన్నై, టీ.నగర్‌: తన భార్యను అప్పగించాలని కోరుతూ ఓ యువకుడు హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశాడు. కోయంబత్తూరు గౌండమ్‌పాళయం సమీపంలోని ఇడయార్‌పాళయం విద్యా కాలనీకి చెందిన రాజేంద్రన్‌ కుమారుడు కార్తికేయన్‌ (35). తిరుచ్చి సంజీవి నగర్‌కు చెందిన సుందరరాజన్‌ కుమార్తె తమిళిని ప్రభ (25). వేర్వేరు కులాలకు చెందిన వీరు ప్రేమించుకుని కోవైలో ఈ నెల 5వ తేదిన వివాహం చేసుకున్నారు. వీరి వివాహాన్ని తమిళిని ప్రభ తల్లిదండ్రులు అంగీకరించలేదు. అయితే కార్తికేయన్‌ తల్లిదండ్రులు అంగీకరించారు. ఇలా ఉండగా ఐదు రోజుల క్రితం యువతి తల్లిదండ్రులు, బంధువులు కార్తికేయన్‌ ఇంటికి వచ్చి కార్తికేయన్, అతని తల్లిపై దాడి చేసి తమిళిని ప్రభను బలవంతంగా కారులో తీసుకెళ్లారు. (మనోవేదనతో సర్పంచ్‌ ఆత్మహత్య )

ఈ దృశ్యాలు అక్కడున్న నిఘా కెమెరాల్లో నమోదయ్యాయి. దీని గురించి కుడియలూరు పోలీసులకు ఫిర్యాదు అందింది. పోలీసులు కేసు నమోదు చేసి తమిళిని ప్రభను, రక్షించేందుకు తిరుచ్చికి వెళ్లారు. ఆ సమయంలో తనను ఎవరూ కిడ్నాప్‌ చేయలేదని, తన తండ్రి అనారోగ్యంగా ఉన్నందున రెండు, మూడు రోజుల్లో ఊరికి తిరిగి వస్తానని తమిళిని ప్రభ పోలీసులకు తెలిపారు. ఇలా ఉండగా కార్తికేయన్‌ మద్రాసు హైకోర్టులో మంగళవారం ఒక పిటిషన్‌ దాఖలు చేశారు. అందులో కులాంతర వివాహం చేసుకున్నందున తన భార్యను కిడ్నాప్‌ చేశారని, ఆమె తల్లిదండ్రులు, బంధువులు ఆమెను పరువు హత్య చేసే  అవకాశముందని, భార్యను తనకు అప్పగించేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు. (కులాంతర వివాహాలు చేసుకునే వారికి గుడ్‌న్యూస్‌)

Read latest State News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top