తుపాకితో కాల్చుకొని.. హెడ్‌ కానిస్టేబుల్‌ ఆత్మహత్య | Head constable committed suicide by blowing up a gun .. | Sakshi
Sakshi News home page

తుపాకితో కాల్చుకొని.. హెడ్‌ కానిస్టేబుల్‌ ఆత్మహత్య

Mar 19 2017 12:40 PM | Updated on Nov 6 2018 7:53 PM

విధి నిర్వాహణలో ఉన్న ఓ హెడ్‌ కానిస్టేబుల్‌ తన తుపాకీతో కాల్చుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.

కోరాపుత్‌(ఒడిశా): విధి నిర్వాహణలో ఉన్న ఓ హెడ్‌ కానిస్టేబుల్‌ తన తుపాకీతో కాల్చుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన ఒడిశాలోని కోరాపుత్‌లో ఆదివారం చోటుచేసుకుంది. స్థానిక కోబ్రా 202 బెటాలియన్‌లో హెడ్‌ కానిస్టేబుల్‌గా పని చేస్తున్న శంకర్‌ ప్రసాద్‌ తన ఎస్‌ ఎల్‌ ఆర్‌ రైఫిల్‌తో కాల్చుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. హెడ్‌ కానిస్టేబుల్‌ మృతి పై ఉన్నతాధికారులు విచారణ చేపడుతున్నారు. ఆత్మహత్యకు దాపరించిన   కారణాలు తెలియాల్సి ఉంది. 

Advertisement
 
Advertisement
Advertisement