కోలీవుడ్‌లో గోవిందుడు అందరివాడు | Govindudu Andarivadele in Kollywood | Sakshi
Sakshi News home page

కోలీవుడ్‌లో గోవిందుడు అందరివాడు

Feb 26 2015 1:20 AM | Updated on Oct 30 2018 5:58 PM

కోలీవుడ్‌లో గోవిందుడు అందరివాడు - Sakshi

కోలీవుడ్‌లో గోవిందుడు అందరివాడు

తెలుగులో మంచి విజయాన్ని చవిచూసిన గోవిందుడు అందరివాడు చిత్రం ఇప్పుడు తమిళ ప్రేక్షకులను అలరించడానికి సిద్ధం అవుతోంది. యువ నటుడు రామ్‌చరణ్,

 తెలుగులో మంచి విజయాన్ని చవిచూసిన గోవిందుడు అందరివాడు చిత్రం ఇప్పుడు తమిళ ప్రేక్షకులను అలరించడానికి సిద్ధం అవుతోంది. యువ నటుడు రామ్‌చరణ్, కాజల్ అగర్వాల్ జంటగా నటించిన ఈ చిత్రానికి కుటుంబ కథా చిత్రాలను అందంగా తెరకెక్కించడంలో సిద్ధహస్తుడైన కృష్ణవంశీ దర్శకత్వం వహించారు. ప్రేమానుబంధాలు, ఆప్యాయతలు, చిన్న చిన్న మనస్పర్థలు అంటూ పల్లెటూరి వాతావరణంలో సాగే కుటుంబ కథా చిత్రం గోవిందుడు అందరివాడు.
 
 ఈ తరం కోరుకునే కమర్షియల్ అంశాలతో తెరకెక్కిన ఈ చిత్రాన్ని ఐఫర్ ఇంటర్నేషనల్ పతాకంపై రఫి మతిర్ రామ్‌లీలా పేరుతో తమిళంలోకి అనువదిస్తున్నారు. ప్రకాష్‌రాజ్, రాజ్‌కిరణ్, కమలిని ముఖర్జి, రెహ్మాన్, ప్రగతి, శ్రీకాంత్ ముఖ్యపాత్రలు పోషించిన ఈ చిత్రానికి యువన్ శంకర్ రాజా సంగీతాన్ని అందించారు. చిత్ర అనువాద కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్ని త్వరలోనే విడుదల చేయనున్నట్లు నిర్మాత తెలిపారు.
 

Advertisement
 
Advertisement
Advertisement