స్కేటింగ్‌ చిన్నారి ఘనత

Girl Child Talent in Skating Board - Sakshi

చెన్నై ,టీ.నగర్‌: మహాబలిపురానికి చెందిన తొమ్మిదేళ్ల బాలిక కమలిమూర్తి స్కేటింగ్‌లో అసాధారణ ప్రతిభ చూపించింది. గౌను ధరించి స్కేటింగ్‌బోర్డ్‌ను ఉపయోగించిన సమయంలో తీసిన ఫోటో అంతర్జాతీయ స్థాయిలో ప్రముఖ స్కేట్‌ బోర్డరైన డోనీ హాకిన్స్‌ కళ్లలో పడింది. పాదరక్షలు కూడా లేకుండా ఒక బాలిక అసాధ్యమైన స్కేటింగ్‌ బోర్డును ఉపయోగించడం గమనించిన డోని ఈ ఫోటోను సోషల్‌ మీడియాలో విడుదల చేయగా ప్రపంచస్థాయిలో పేరుపొందింది.

దీంతో న్యూజిలాండ్‌కు చెందిన షషా రెయిన్‌బో అనే డైరెక్టర్‌ తమిళనాడు చేరుకుని కమలి పేరుతోనే 24 నిమిషాల నిడివితో డాక్యుమెంటరీ రూపొందించారు. ఈ డాక్యుమెంటరీ గత నెల జరిగిన అట్లాంటా చిత్రోత్సవంలో ఉత్తమ డాక్యుమెంటరీ చిత్రంగా అవార్డు పొందింది. గత ఏడాది డిసెంబర్‌లో ముంబై అంతర్జాతీయ డాక్యుమెంటరీ చిత్రోత్సవంలో ఉత్తమ దర్శకుని అవార్డును చేజిక్కించుకుంది. కమలి, ఆమె తల్లి సుగంధి, అవ్వ గురించి వివరిస్తూ ఉన్న ఈ చిత్రం 2020 ఆస్కార్‌ అవార్డు సిఫార్సుల జాబితాలో చోటు సంపాదించుకుంది. కమలి తల్లి సుగంధి సోమవారం ఈ సందర్భంగా మాట్లాడుతూ తమ కుమార్తె తర్వాత తమకు లభించిన పెద్ద గౌరవమని వ్యాఖ్యానించారు.

Read latest State News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top