త్వరలో జరుగనున్న పార్లమెంటు ఎన్నికలకు కార్యకర్తలు సిద్ధం కావాలని కేంద్ర మాజీ మంత్రి జగత్క్ష్రగన్ పిలుపు నిచ్చారు. వేలూరులో మంగళవారం డీఎంకే కార్యకర్తల సమావేశం జరిగింది.
పార్లమెంట్ ఎన్నికలకు సిద్ధంకండి
Sep 4 2013 6:24 AM | Updated on Sep 1 2017 10:26 PM
వేలూరు, న్యూస్‌లైన్: త్వరలో జరుగనున్న పార్లమెంటు ఎన్నికలకు కార్యకర్తలు సిద్ధం కావాలని కేంద్ర మాజీ మంత్రి జగత్క్ష్రగన్ పిలుపు నిచ్చారు. వేలూరులో మంగళవారం డీఎంకే కార్యకర్తల సమావేశం జరిగింది. ఈ రాష్ట్రంలో పార్టీ అభివృద్ధికి కార్యకర్తలు, నేతలు పాటు పడాలన్నారు. రాష్ట్రప్రభుత్వ అవినీతిని ప్రజలకు తెలియజెప్పాలన్నారు. ఇంటింటికీ కరపత్రాలను పంపిణీ చేయాలన్నారు. వేలూరుకు కరుణానిధి వస్తున్నారని, ఈ సందర్భంగా బ్యానర్లు కట్టేందుకు పోలీసులు అనుమతి ఇవ్వడంలేదన్నారు. దీనికి కార్యకర్తలు భయపడాల్సిన పనిలేదన్నారు. ముందుగా డీఎస్పీకి వినతి పత్రం ఇవ్వాలని, అప్పటికీ అనుమతి ఇవ్వకపోతే ఆందోళన చేస్తామని ఆయన హెచ్చరించారు.
పార్లమెంట్ ఎన్నికల్లో విజయానికి పార్టీ కార్యకర్తలు సైనికుల్లా కష్టపడి పనిచేయాలని రాష్ట్ర మాజీ మంత్రి దురైమురగన్ పిలుపు నిచ్చారు. కార్యకర్తలు పదవుల కోసం కాకుండా పార్టీ అభివృద్ధి కోసం కష్టపడి పనిచేయాలన్నారు. ఈనెల 15వ తేదీన వేలూరు ఊరీస్ డిగ్రీ కళాశాలలో జరిగే కార్యకర్తల సమావేశానికి అధిక సంఖ్యలో కార్యకర్తలు, అభిమానులు తరలిరావాలన్నారు. ఈ సమావేశానికి మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి హాజరవుతారన్నారు. జిల్లా సరిహద్దు వాలాజ నుంచి రాణిపేట, విషారం మీదుగా వేలూరు రానున్నారని ఆయా ప్రాంతాల ఇన్‌చార్జిలు కరుణానిధికి ఘన స్వాగతం పలకాలన్నారు.
రాష్ట్రంలోనే డీఎంకు వేలూరు కోటగా వుందని ఇక్కడ మన సత్తా చూపించాలన్నారు. రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో 40 స్థానాలు డీఎంకే కైవసం చేసుకోవడానికి యూనియన్ కార్యదర్శులు, జిల్లా కార్యదర్శులు, యువత కష్ట పడి పనిచేయాలన్నారు. కరుణానిధికి వేలూరు జిల్లాపై ప్రత్యేక అభిమానం ఉంద ని ఆ నమ్మకాన్ని వమ్ము చేయకుండా కష్ట పడాలన్నారు. ఈ సమావేశంలో జిల్లా కార్యదర్శి ఆర్.గాంధీ, మాజీ మేయర్ కార్తికేయన్, మాజీ ఎంపీ అబ్దుల్ రహమాన్, యూనియన్ కార్యదర్శి ఆర్‌పీ ఏయుమలై, పట్టణ కార్యదర్శి రామలింగం, డీఎంకే నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
Advertisement


