ఎగువ ప్రాంతాల నుంచి నిజాంసాగర్‌కు భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది.
ఎగువ ప్రాంతాల నుంచి భారీగా వరద నీరు వచ్చి చేరుతుండటంతో.. నిజాంసాగర్‌కు ఇన్‌ఫ్లో పెరుగుతోంది. ప్రస్తుతం ప్రాజెక్ట్ 23 గేట్లు ఎత్తి నీటిని కిందకు వదులుతున్నారు. ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటిమట్టం 1,405 అడుగులు కాగా ప్రస్తుతం 1401 అడుగుల వరకు నీరు చేరింది. ఇన్ ఫ్లో 1,73 క్యూసెక్కులు ఉండటంతో.. ప్రాజెక్ట్ 23 గేట్ల ద్వారా అంతే మొత్తంలో నీటిని కిందకు వదులుతున్నారు. ఆదివారంతో పోల్చుకుంటే సోమవారం ఉదయం వరద ఉధృతి పెరిగిందని ప్రాజెక్ట్ డిప్యూటీ ఏఈ సురేష్‌బాబు తెలిపారు.