బస్సులో మంటలు..తప్పిన ప్రమాదం | Fire accident in rtc bus at krishna district passengers tension | Sakshi
Sakshi News home page

బస్సులో మంటలు..తప్పిన ప్రమాదం

Sep 26 2016 7:53 PM | Updated on Sep 5 2018 9:47 PM

కృష్ణా జిల్లాలో ఆర్టీసీ బస్సుకు త్రుటిలో పెనుప్రమాదం తప్పింది.

నందిగామ: కృష్ణా జిల్లాలో ఆర్టీసీ బస్సుకు త్రుటిలో పెనుప్రమాదం తప్పింది. విజయవాడ నుంచి హైదరాబాద్ వస్తున్న ఆర్టీసీ సూపర్ లగ్జరీ బస్సు నందిగామ పోలీస్‌స్టేషన్ సమీపంలోకి చేరుకోగానే ఒక్కసారిగా బస్సులో మంటలు చెలరేగాయి.

అప్రమత్తమైన డ్రైవర్ వెంటనే బస్సును రోడ్డు పక్కన నిలిపేశాడు. బస్సులోని 20 మంది ప్రయాణికులను కిందికి దించేశాడు. ప్రయాణికులందరూ కలసి మంటలను ఆర్పేశారు. దీంతో పెనుప్రమాదం తప్పినట్లైంది. బస్సు తిరిగి హైదరాబాద్కు బయలుదేరింది. ప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదు.

Advertisement
 
Advertisement
Advertisement