మంటల్లో మల్లన్న ఆలయం | fire accident in mallaiah hill | Sakshi
Sakshi News home page

మంటల్లో మల్లన్న ఆలయం

Feb 22 2017 1:10 PM | Updated on Sep 5 2018 9:47 PM

చిత్తూరు జిల్లా తంబళ్లపల్లి మండలంలో ఉన‍్న మల్లయ్యకొండపై బుధవారం ఉదయం భారీ అగ్నిప్రమాదం సంభవించింది.

తంబళ్లపల్లి: చిత్తూరు జిల్లా తంబళ్లపల్లి మండలంలో ఉన‍్న మల్లయ్యకొండపై బుధవారం ఉదయం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. దీంతో కొండపై ఉన్న మల్లికార్జునస్వామి ఆలయాన్ని అగ్నికీలలు చుట్టుముట్టాయి. దాదాపు ఐదువేల హెక్టార్లలో ఈ మంటలు వ్యాపించాయి. ఇప్పటికే వెయ్యి హెక్టార్లలో అటవీ సంపద అగ్నికి ఆహుతైంది. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేయడానికి తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. పశువులను మేతకు తోలుకెళ్ళిన కాపర్లు చెత‍్త కుప‍్పకు నిప్పు పెట‍్టడంవల‍్లే అడవి తగలబడుతోందని భావిస్తున్నారు. కొండ పైభాగంలో మల‍్లన‍్నస్వామి ఆలయం ఉంది. ఆలయం పరిసరాల‍ చుట్టూ మంటలు చెలరేగాయి.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement