కుమార్తెను చంపి ..ఆత్మహత్య చేసుకున్న తండ్రి | father commit suicide after murdered his daughter | Sakshi
Sakshi News home page

కుమార్తెను చంపి ..ఆత్మహత్య చేసుకున్న తండ్రి

Jan 9 2017 4:43 PM | Updated on Aug 24 2018 2:36 PM

కుమార్తెను చంపి తాను ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడో తండ్రి.

చుండూరు: కుమార్తెను చంపి తాను ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడో తండ్రి. ఈ సంఘటన గుంటూరు జిల్లా చుండూరు మండలం యడ్లపల్లిలో జరిగింది. అంగిరేకుల రాజు(30)కు చైతన్యపద్మావతి (8) అనే కుమార్తె ఉంది. ఏడాది క్రితం ఇతని భార్య మొక్కజొన్న కంకెల మిషన్‌లో పడి మృతి చెందింది. దీంతో అతను కుమార్తెను చదివించకోవడానికి తల్లిదండ్రులతో కలిసి తెనాలిలోని రవీంద్రనగర్‌ కాలనీలో ఉంటున్నాడు. అప్పటి నుంచి మనోవేదనతో ఉన్న రాజు  సోమవారం కుమార్తెను పొలానికి తీసుకెళ్లి అక్కడే ఆమెను చంపి చెట్టుకు ఉరివేసుకుని తాను ఆత్మహత్య చేసుకున్నాడు. తన భార్య చనిపోయినప్పటి నుంచి ఇబ్బందులు పడుతున్నట్టు రాజు లేఖలో రాశాడు. తెనాలి సీఐ కల్యాణరావు, చుండూరు ఎస్సై విక్టర్‌లు సంఘటన స్థలాన్ని పరిశీలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement