‘సీఎం వద్దే తేల్చుకుంటాం’ | farmers padayatra in kamareddy | Sakshi
Sakshi News home page

‘సీఎం వద్దే తేల్చుకుంటాం’

Mar 18 2017 4:34 PM | Updated on Sep 5 2017 6:26 AM

అకాల వర్షం, వడగళ్ల వానకు జరిగిన పంట నష్టంపై సీఎం వద్దే తేల్చుకుంటామంటూ అన్నదాతలు పట్టుబడుతున్నారు.

బీర్కూర్‌: కామారెడ్డి జిల్లా బీర్కూరు ప్రాంతంలో గురువారం రాత్రి కురిసిన అకాల వర్షం, వడగళ్ల వానకు జరిగిన పంట నష్టంపై ఇక సీఎం వద్దే తేల్చుకుంటామంటూ బీర్కూరు అన్నదాతలు పట్టుబడుతున్నారు. ఈ మేరకు హైదరాబాద్‌కు పాదయాత్ర చేపట్టారు. నష్ట పరిహారంపై జాయింట్‌ కలెక్టర్‌ సత్తయ్య, ఆర్డీవో రాజేశ్వర్‌ల హామీతో వారు సంతృప్తి చెందలేదు. వెంటనే పరిహారం మంజూరు చేయాలని డిమాండ్‌ చేస్తున్నారు. ఇక సీఎం కేసీఆర్‌ వద్దే తేల్చుకుంటామంటూ సుమారు 300 మంది రైతులు కిష్టాపూర్‌ నుంచి హైదరాబాద్‌కు పాదయాత్ర ప్రారంభించారు. ఇందుకు బీర్కూరు ఎస్సై, ఎమార్వోల నుంచి అనుమతి కూడా పొందారు. కాగా, హైదరాబాద్‌ వెళ్లొద్దంటూ టీఆర్‌ఎస్‌ నాయకులు రైతులను బుజ్జగిస్తున‍్నట్లు తెలుస్తోంది.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement