తీవ్రంగా కొట్టి.. గొంతులో సూది గుచ్చారు | farmer attacked by unknown in medak district | Sakshi
Sakshi News home page

తీవ్రంగా కొట్టి.. గొంతులో సూది గుచ్చారు

Sep 8 2016 12:44 PM | Updated on Jul 11 2019 7:45 PM

మెదక్ జిల్లాలోని ఎర్రవల్లి లో గురువారం దారుణం చోటు చేసుకుంది.

ఎర్రవల్లి: మెదక్ జిల్లాలోని ఎర్రవల్లి లో గురువారం దారుణం చోటు చేసుకుంది. పొలానికి వెళ్లి వస్తున్న ఓ వ్యక్తిపై దుండగులు కర్రలతో దాడి చేశారు. అనంతరం తీవ్రంగా హింసించి  గొంతులో సూది గుచ్చారు. మల్లన్న సాగర్ ముంపు ప్రాంతంలో ప్రభుత్వానికి ఇవ్వడానికి సిద్ధంగా ఉంచిన భూమిని ఇతరుల పేరుతో దొంగ రిజిస్ట్రేషన్ చేశారని గత కొన్ని రోజులుగా గోపాల్ రెడ్డి అనే వ్యక్తి పోరాడుతున్నాడు. సదరు వ్యక్తి ఈ రోజు వ్యవసాయ బావి వద్ద నుంచి వస్తుండగా గుర్తుతెలియని దుండగులు దాడి చేశారు. అనంతరం గొంతులో సూదిని గుచ్చారు. పరిస్థితి విషమించడంతో మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ తరలించారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. 

Advertisement
 
Advertisement
Advertisement