టీవైయూపీలోనే ప్రవేశాలు | DU told to admit students in three-year course: Irani | Sakshi
Sakshi News home page

టీవైయూపీలోనే ప్రవేశాలు

Jul 7 2014 10:23 PM | Updated on Sep 2 2017 9:57 AM

టీవైయూపీలోనే ప్రవేశాలు

టీవైయూపీలోనే ప్రవేశాలు

మూడేళ్ల అండర్‌గ్రాడ్యుయేట్ కోర్సు (టీవైయూపీ)లోనే విద్యార్థులను చేర్చుకోవాలంటూ ఢిల్లీ విశ్వవిద్యాలయాన్ని (డీయూ)ని యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) ఆదేశించిందని

న్యూఢిల్లీ: మూడేళ్ల అండర్‌గ్రాడ్యుయేట్ కోర్సు (టీవైయూపీ)లోనే విద్యార్థులను చేర్చుకోవాలంటూ ఢిల్లీ విశ్వవిద్యాలయాన్ని (డీయూ)ని యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) ఆదేశించిందని కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి స్మృతి ఇరానీ చెప్పారు. తన ఆదేశాలను తూచ తప్పకుండా పాటించాలంటూ యూజీసీ ఆదేశించిందని, విద్యార్థులందరినీ మూడేళ్ల అండర్‌గ్రాడ్యుయేట్ కోర్సు (టీవైయూపీ) లోనే విద్యార్థులను చేర్చుకోవాలని కోరిందని రాజ్యసభకు లిఖితపూర్వక ంగా ఇచ్చిన జవాబులో ఇరానీ వెల్లడించారు.
 
 ఐదుగురు ప్రముఖ విద్యానిపుణులతో కూడిన సలహా కమిటీని యూజీసీ ఇటీవల నియమించిందని ఈ సందర్భంగా తెలియజేశారు. నేషనల్ పాలసీ ఆన్ ఎడ్యుకేషన్ (ఎన్‌పీఈ) విధానానికి నాలుగేళ్ల అండర్‌గ్రాడ్యుయేట్ కోర్సు (ఎఫ్‌యూవైపీ) పూర్తిగా విరుద్ధమని సూచించిందన్నారు. దీంతో నాలుగేళ్ల అండర్‌గ్రాడ్యుయేట్ కోర్సు (ఎఫ్‌వైయూపీ)ను ఉపసంహరించుకోవాలని డీయూ నిర్ణయించిందన్నారు. నేషనల్ పాలసీ ఆన్ ఎడ్యుకేషన్ (ఎన్‌పీఈ) విధానానికి ఇబ్బందికరంగా పరిణమించే ఆర్డినెన్సులకు సంబంధిత యంత్రాంగం నుంచి ఎటువంటి ఆమోదమూ లేదని స్పష్టం చేశారు.
 

Advertisement
 
Advertisement
Advertisement