'జాతీయ పార్టీలతో పొత్తులు లేకుండా బరిలోకి' | DMK releases manifesto for upcoming Lok Sabha polls | Sakshi
Sakshi News home page

'జాతీయ పార్టీలతో పొత్తులు లేకుండా బరిలోకి'

Mar 11 2014 12:54 PM | Updated on Mar 29 2019 9:18 PM

'జాతీయ పార్టీలతో పొత్తులు లేకుండా బరిలోకి' - Sakshi

'జాతీయ పార్టీలతో పొత్తులు లేకుండా బరిలోకి'

డీఎంకే అధ్యక్షుడు కరుణానిధి మంగళవారం ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేశారు.

చెన్నై : డీఎంకే అధ్యక్షుడు కరుణానిధి మంగళవారం ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేశారు. డీఎంకే కేంద్ర కార్యాలయమైన అన్నా అరివాళయంలో  కరుణానిధి పార్టీనేతల సమక్షంలో విడుదల చేసిన మేనిఫెస్టోలో ఉరిశిక్ష, నదులను అనుసంధానం, రైతుల రుణాలు, విద్యారుణాలు మాఫీ చేస్తామని  పేర్కొన్నారు. ఈ సందర్భంగా కరుణానిధి మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో జాతీయ పార్టీలతో పొత్తులు లేకుండానే బరిలోకి దిగి విజయం సాధిస్తామన్నారు.   ప్రధానమంత్రి అభ్యర్థుల్లో ఎవరికైనా తమ మద్దతు ఉంటుందన్నారు.

కాగా కరుణానిధి లోక్‌సభ అభ్యర్థుల తొలి జాబితాను నిన్న విడుదల చేసిన విషయం తెలిసిందే. మిత్రపక్షాలతో కలుపుకుని 40 స్థానాలకు గాను 35 స్థానాలకు అభ్యర్థుల పేర్లను ప్రకటించారు. అలాగే 2జీ కుంభకోణంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఏ.రాజా నీలగిరి, దయానది మారన్ మధ్య చెన్నై ప్రాంతం నుండి పోటీ చేయనున్నారు. ఇక పార్టీ నుంచి సస్పెండ్ చేసిన పెద్ద కుమారుడు ఆళగిరికి కరుణ మొండిచేయి చూపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement