ధనుష్ డబుల్ ధమాకా

ధనుష్ డబుల్ ధమాకా


 సినిమా కలర్ మారుతోందని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అభిమానుల అభిరుచి మారుతుందనడం కంటే సినిమా పై వారి ఐక్యూ పెరుగుతోందనడం కరెక్ట్. సాంకేతిక అభివృద్ధితో వారితో సినిమా పరిజ్ఞానం పెంపొందుతోందనవచ్చు. ఏదేమయినా ఇప్పుడు సాదాసీదా చిత్రాలకు ఆదరణ లభించే ప్రసక్తే లేదు.దర్శక నిర్మాతలు ఒళ్లు దగ్గర పెట్టుకుని చిత్రాలు చెయ్యాల్సిన పరిస్థితి. కొత్త సీసాలో పాత నీరు పోసినా కథనంలో కొత్తదనం, ఇతర సాంకేతిక పరిజ్ఞానంతో రెండు గంటలపాటు ప్రేక్షకుల్ని కథలో పయనించేలా చెయ్యాలి. ఇక హీరోల ద్విపాత్రాభినయం అనేది కొత్తేమి కాదు.అయితే ఈ ప్రక్రియలో ధనుష్‌ను కొత్తగా చూపిస్తానంటున్నారు యువ దర్శకుడు దురై సెంథిల్ కుమార్. సినిమాల్లో ద్విపాత్రాభినయం కొత్తేమీ కాదు.

 

 అయితే నటుడు ధనుష్‌కు మాత్రం కొత్తే.ఆయన్ని అన్నదమ్ములుగా విభిన్నంగా చూపిస్తా నంటున్నారు యువ దర్శకుడు దురై సెంథిల్‌కుమార్. ఇంతకు ముందు ఎదుర్ నీశ్చల్, కాక్కిసట్టై వంటి సక్సెస్‌పుల్ చిత్రాలను తెరకెక్కించిన ఆయన తాజాగా ధనుష్‌తో ఒక భారీ చిత్రాన్ని తెరపై ఆవిష్కరించడానికి సిద్ధం అవుతున్నారు.ఇందులో ధనుష్ ద్విపాత్రాభినయం చేయనున్నారు. కాగా ఇందులో కథానాయికలు ఎవరన్నదే రకరకాల ప్రచారం జరుగుతోంది.ఇంతకు ముందు పెద్ద ధనుష్ సరసన బాలీవుడ్ భామ విద్యాబాలన్ నటించనున్నట్లు ప్రచారం జరిగింది.అయితే ఆమె కాల్సీట్స్ లేవనడంతో ఇప్పుడా పాత్రకు నటి లక్ష్మీమీనన్‌ను ఎంపిక చేశారు. ఇక రెండవ ధనుష్‌కు జంట గా నటించే నటి అన్వేషణ ఫలించిందన్నది తాజా సమాచారం.

 

 ఆ పాత్రకు నటి షామిలిని ఎంపిక చేసినట్లు తెలిసింది. బాల నటిగా పలు చిత్రాలు చేసిన షాలిని కథానాయికగా తెలుగులో ఓయ్ అనే ఒక చిత్రం చేసినా తమిళంలో నటించలేదు. ఆ మధ్య కేఎస్.రవికుమార్ దర్శకత్వంలో సుధీప్‌కు జంటగా నటించనున్నట్లు ప్రచారం జరిగింది.అయితే ఆ చిత్రంలో నటి నిత్యామీనన్ నటిస్తున్నారు. షామిలి నటించకపోవడానికి కారణాలు తెలియలేదు. ప్రస్తుతం విక్రమ్‌ప్రభు సరసన వీరశివాజీ చిత్రంలో నటించడానికి సిద్ధం అవుతున్నారు. తాజాగా ధనుష్‌తో రొమాన్స్ చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలిసింది. మొత్తం మీద ధనుష్ లక్ష్మీమీనన్, షామిలి లతో డబుల్‌ఢమాకాకు సిద్ధం అవుతున్నారన్న మాట. చిత్రం త్వరలో ప్రారంభం కానుంది.

 

Read latest State News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top