
హీరోయిన్లు అయితే సినిమాలు చేస్తుంటారు. లేదంటే సైలెంట్‌గానే ఉంటారు. పెద్దగా వార్తల్లో నిలవాలని అనుకోరు. కానీ కొందరు మాత్రం అతిగా ప్రవర్తిస్తుంటారు. ప్రముఖ హీరోయిన్ ఇప్పుడు అలానే ఓ ఐటీ ఉద్యోగిని కిడ్నాప్ చేసిన కేసులో ఇరుక్కుంది. ప్రస్తుతానికైతే ఈమె పరారీలో ఉంది. కానీ హీరోయిన్ ఫ్రెండ్స్ ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ విషయం చర్చనీయాంశంగా మారింది.
ఇంతకీ ఏమైంది?
కేరళ కొచ్చికి చెందిన లక్ష‍్మీ మేనన్.. తమిళ, మలయాళంలో హీరోయిన్‌గా చేసింది. 2011 నుంచి సినిమాలు చేస్తోంది. ఈ ఏడాది 'శబ్దం' అనే మూవీ చేసింది. గజరాజు, ఇంద్రుడు, చంద్రముఖి 2 లాంటి డబ్బింగ్ చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు ఈమె కాస్త పరిచయమే. అలాంటిది ఇప్పుడు నిజ జీవితంలోనూ రౌడీలా ప్రవర్తించింది. ఆ వీడియో వైరల్ అవుతోంది.
(ఇదీ చదవండి: భాగ్యశ్రీ ఫ్యాన్స్‌ని హర్ట్ చేసిన 'కింగ్డమ్' ఓటీటీ వెర్షన్)
ఆదివారం (ఆగస్టు 24) రాత్రి కొచ్చిలోని ఓ బార్ దగ్గర లక్ష‍్మీ మేనన్, ఆమె ఫ్రెండ్స్‌కి మరికొందరితో గొడవ జరిగింది. ఈ క్రమంలోనే తమపై అరుస్తున్న సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని కిడ్నాప్ చేశారు. తమ కారులో ఎక్కించుకుని బెదిరించి, బూతులు తిట్టి హింసించారు. కాసేపటి తర్వాత ఆమెని మరో చోట విడిచిపెట్టారు. ఈ సంఘటన తర్వాత బాధితురాలు ఎర్నాకులం పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది.
విచారించిన పోలీసులు.. గొడవకు కారణమైన లక్ష‍్మీ మేనన్ స్నేహితులు ముగ్గురిని అరెస్ట్ చేశారు. నటి కోసం ప్రయత్నిస్తుంటే ఆమె ఫోన్ స్విచ్ఛాప్ వస్తోంది. ప్రస్తుతం పరారీలో ఉన్న లక్ష‍్మీ మేనన్‌ని పట్టుకునేందుకు పోలీసులు వెతుకుతున్నారు. ఇప్పుడు ఈ విషయం సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. లక్ష‍్మీ మేనన్ గ్యాంగ్.. ఐటీ ఎంప్లాయ్‌ని బెదిరిస్తున్న ఓ వీడియో కూడా వైరల్ అవుతోంది.
(ఇదీ చదవండి: ఓటీటీలో తమిళ హిట్ సినిమా.. ఇప్పుడు తెలుగులోనూ)
ஐ.டி ஊழியர் கடத்தல் வழக்கில் விசாரணைக்கு அழைக்கப்பட்ட நடிகை லட்சுமிமேனன் தலைமறைவான நிலையில் காரை வழிமறித்து தகராறு செய்வது போன்ற வீடியோ வெளியாகி வைரல்..#Polimer | #Police | #Kerala | #LakshmiMenon | #Arrest pic.twitter.com/zipPD6H8PN
— Polimer News (@polimernews) August 27, 2025