
మలయాళ నటి లక్ష్మీ మేనన్ (Lakshmi Menon)కు కోర్టులో ఊరట లభించింది. ఆమెను అరెస్ట్‌ను తాత్కాలికంగా ఆపేయాలంటూ కేరళ కోర్టు ముందస్తు బెయిల్‌ను మంజూరు చేసింది. సోషల్‌మీడియాలో లక్ష్మీ మేనన్ పేరు హాట్‌టాపిక్‌గా మారింది. కొచ్చిలోని ఐటీ ఉద్యోగిపై తన స్నేహితులతో కలిసి కిడ్నాప్ చేయడమే కాకుండా అతడిపై దాడి చేశారని ఆరోపణలు వచ్చాయి. దాడి చేసిన ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేయగా నటి లక్ష్మీ మేనన్ పరారీలో ఉన్నారని వార్తలు వచ్చాయి.
లక్ష్మీ మేనన్‌పై కేసు నమోదు కావడంతో ఆమె ముందస్తు బెయిల్ కోసం కేరళ కోర్టును సంప్రదించారు. దీంతో న్యాయస్థానం కూడా ఆమెకు సానుకూలంగానే ఆదేశాలు ఇచ్చింది. సెప్టెంబర్ 17వరకు ఆమెను అరెస్ట్ చేయకండి అంటూ పోలీసులను సూచించింది. అయితే, ఆమె స్నేహితులు మిథున్, అనీష్, సోనమోల్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు.
అసలు కారణం ఏంటి..?
లక్ష్మీ మేనన్ వివాదంలో పోలీసులు ఇలా చెప్పారు. 'ఓ బార్ వద్ద లక్ష్మీ మేనన్, ఐటీ ఉద్యోగి టీమ్ మధ్య మొదట వివాదం వచ్చింది. ఇరు గ్రూపుల మధ్య మాటకుమాట పెరిగింది. దీంతో అక్కడి నుంచి వెళ్లిపోతున్న ఐటీ ఉద్యోగిని లక్ష్మీ మేనన్‌తో పాటు ఆమె స్నేహితులు వెంబడించారు. ఆపై అతడిని దాడిచేశారు. కేరళ కొచ్చికి చెందిన లక్ష‍్మీ మేనన్.. తమిళ, మలయాళంలో హీరోయిన్‌గా చేసింది. 2011 నుంచి సినిమాలు చేస్తోంది. ఈ ఏడాది 'శబ్దం' అనే మూవీ చేసింది. గజరాజు, ఇంద్రుడు, చంద్రముఖి 2 లాంటి డబ్బింగ్ చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు ఈమె కాస్త పరిచయమే.
ஐ.டி ஊழியர் கடத்தல் வழக்கில் விசாரணைக்கு அழைக்கப்பட்ட நடிகை லட்சுமிமேனன் தலைமறைவான நிலையில் காரை வழிமறித்து தகராறு செய்வது போன்ற வீடியோ வெளியாகி வைரல்..#Polimer | #Police | #Kerala | #LakshmiMenon | #Arrest pic.twitter.com/zipPD6H8PN
— Polimer News (@polimernews) August 27, 2025
